KotaBommali: ఒక్క ప్రమోషన్ వదలట్లేదు! ఎన్ని ఆశలు పెట్టుకుందో?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వాలని చాలా మంది హీరోయిన్లు కలలుగంటూ ఉంటారు. కానీ టాలెంట్ ఉన్న కొందరికే ఆ ఛాన్స్ దక్కుతుంది. మరి కొందరు గ్లామర్ షో తో నెట్టుకొస్తారని భావించినా, అవి కొన్ని ఎక్కువ ఆఫర్లు తీసుకొస్తాయేమో గాని, స్టార్ హీరోయిన్ గా మాత్రం కాలేరు. ఇక తెలుగు హీరోయిన్లకైతే చాలా తక్కువ. అడపాదడపా అంజలి లాంటి హీరోయిన్లు ఇతర ఇండస్ట్రీ లో ఫేమస్ అయ్యి ఇక్కడ పేరు పెంచుకున్నవాళ్లే.

అయితే తెలుగు హీరోయిన్ గా ఒకప్పటి స్టార్ హీరో కూతురిగా మంచి బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చి కూడా హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది శివాని రాజశేఖర్ కి. అవును.. రాజశేఖర్ కూతురిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పెద్ద గ్లామర్ షో చేయకున్నా, మంచి యాక్టింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. అయితే సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మాయికి కరువయ్యాయి.

ఎందుకంటే స్క్రిప్ట్ సెలక్షన్స్ బాగున్నా, పెర్ఫార్మన్స్ బాగున్నా కూడా ఒక్క హిట్ రావట్లేదు ఈ భామకి. అయితే శివాని హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం “కోట బొమ్మాళి”. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది అమ్మడు. పైగా సినిమాపై చాలా నమ్మకంగా ఉంది కాబోలు, అందుకే చాలా కాన్ఫిడెన్స్ గా ప్రమోషన్లో పాల్గొంటూ సందడి చేస్తుంది.

- Advertisement -

కోట బొమ్మాళి సినిమాపై శివాని ఎన్ని ఆశలు పెట్టుకుందో గాని ఒక్క ప్రమోషన్ కూడా వదలకుండా అన్ని ఇంటర్వ్యూల్లో, ఈవెంట్లలో మేకర్స్ తో పాల్గొంటూ సందడి చేస్తుంది. మరి ఈ సినిమాతోనైనా శివాని రాజశేఖర్ కి ఫస్ట్ హిట్ దక్కుతుందో లేదో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు