Kotabommali: టైటిల్ ఏమో గాని టీజర్ అదిరిపోయింది! దానికి కంటెంట్ యాడ్ అయితే?

టాలీవుడ్ లో ఈ మధ్య చిన్న సినిమాలు తెగ ఆడేస్తున్నాయి. ఈ వారం రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో కీడా కోలా, పొలిమేర2 రెండూ మంచి ప్రేక్షకాదరణ దక్కించుకోగా, నెక్స్ట్ వీక్ కూడా చిన్న సినిమాల సందడే ఉంది. ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న చిన్న సినిమాల్లో క్రేజీ బజ్ ఉన్న సినిమాల్లో “కోట బొమ్మాళి” ఒకటి. శ్రీకాంత్ ప్రత్యేక పాత్రలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో, హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాని తేజ మార్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

తమిళ్ లో హిట్ అయిన ‘నయట్టు’ అనే సస్పెన్స్ థ్రిలర్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ‘లింగడి జింగిడి’ అనే పాట తో బజ్ బాగా పెరిగిపోయింది.

తాజాగా “కోట బొమ్మాళి” సినిమా యొక్క టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక చాలా మంది ఆడియన్స్ ఈ సినిమా టైటిల్ కి అంతగా కనెక్ట్ కాలేదు. ఎదో కామెడీ గా ఉందంటూ ట్రోల్స్ చేసారు. పైగా ఈ సినిమా పాట కూడా మొదట్లో ట్రోల్ అయినా, ఇప్పుడిప్పుడు బాగా సక్సెస్ అయింది.

- Advertisement -

అయితే రిలీజ్ చేసిన టీజర్ చూసాక సినిమాపై అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు. టీజర్ ని చూసాక ఒక్క ముక్కలో చెప్పాలంటే అదిరిపోయిందని చెప్పొచ్చు. సినిమా రాజకీయ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కున్న పోలీస్ ల గురించి ఉందని తెలుస్తూనే ఉంది. ఇక టీజర్ కట్స్ బాగా ఉండగా, అక్కడక్కడా కొన్ని మేకింగ్ షాట్స్ కూడా బాగున్నాయి. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ఇందులో మరో ప్రత్యేక పాత్రలో నటించిందని టీజర్ ద్వారా తెలిసింది.

ఇక గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న కోట బొమ్మాళి సినిమాని వరల్డ్ వైడ్ గా నవంబర్ 24న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు