Srikanth: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘కోట బొమ్మాళి’!

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిన్న సినిమాల్లో క్రేజీ బజ్ ఉన్న సినిమాల్లో “కోట బొమ్మాళి” ఒకటి. శ్రీకాంత్ ప్రత్యేక పాత్రలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో, హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాని తేజ మార్ని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై మొదట్లో ఎవరికీ అంచనాల్లేవు. నిజం చెప్పాలంటే అసలు ఈ సినిమా వస్తున్నట్టు కూడా ఎవరికి తెలీదు. తమిళ్ లో హిట్ అయిన నయట్టు అనే సస్పెన్స్ థ్రిలర్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు.

అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ బజ్ మొదలైంది మాత్రం ఈ సినిమా పాట వల్లే. “లింగ్ డి, జింగ్ డి” అంటూ జానపద స్లాంగ్ లో రిలీజ్ అయిన ఆ పాట సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో పాపులర్ అయింది. పైగా ఆ పాట హిట్ అయినందుకు సెలబ్రేషన్ కూడా చేశారు.

అయితే సినిమా స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయినా రిలీజ్ ఎప్పుడు అవుతుందో చెప్పలేదు. తాజాగా ఈ సినిమా నిర్మిస్తున్న బన్నీ వాసు మూవీ రిలీజ్ డేట్ ని ఆఫీసియల్ గా ప్రకటించారు. “కోట బొమ్మాలి” సినిమాని నవంబర్ 24 న రిలీజ్ చేస్తున్నామని తాజాగా పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇక ఆ టైం లో పెద్ద సినిమాలు కూడా ఏవి లేవు కాబట్టి కోట బొమ్మాళి కి మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు