Pawan Kalyan: రొమాంటిక్ సీన్స్ లేవని పవర్ స్టార్ మూవీనే రిజెక్ట్ చేసింది

టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే స్టార్లుగా హవా చూపిస్తున్నారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఒకరు. సాదాసీదాగానే “ఛలో” సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు.. అదిరిపోయే అందం, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత గీతాగోవిందం సినిమాతో కుర్రకారుని ఆకట్టుకుని.. సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో అవకాశం అందుకొని బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా ద్వారా రష్మిక తన క్రేజ్ ని దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా చేసుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత ఈమెకి బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమితాబచ్చన్ తో ఓ సినిమాలో కూడా నటించింది. తాజాగా రష్మిక మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వీడియో పై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం సీరియస్ గా స్పందించారు. ఈ క్రమంలో రష్మిక గురించి ఓ ఇంట్రెస్టింగ్ వైరల్ గా మారింది. అదేంటంటే ఈమె పవన్ కళ్యాణ్ తో కూడా నటించే అవకాశం వస్తే ఆ చిత్రాన్ని వదులుకుందట.

ఆ చిత్రం మరేదో కాదు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్. ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా కంప్లీట్ గా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కావడంతో ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఉండవు. అయితే అప్పుడప్పుడే హీరోయిన్ గా పేరు సంపాదించుకుంటున్న రష్మికకు ఈ సినిమాలో నివేదా థామస్ ప్లేస్ లో నటించే అవకాశం వచ్చిందట. కానీ ఇలాంటి పాత్రలలో నటిస్తే గ్లామరస్ బ్యూటీగా ఇక ఇండస్ట్రీలో ఉండనేమోనని ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు