Rashmika Mandanna: రష్మిక ఇష్యూ – సెలబ్రెటీల స్పందన… ఇది ఆలోచించాల్సిందే!

కిరాక్ పార్టీ సినిమాతో కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రష్మిక మందన్నా, ఛలో సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా హిట్ కావడంతో రెండవ సినిమాకి విజయ్ దేవరకొండ సరసన గీతగోవిందం సినిమాలో నటించి ఆ సినిమాతో కూడా అద్భుతమైన హిట్ అందుకుంది. ఆ తర్వాత చేసిన దేవదాస్ సినిమా అనుకున్న విజయాన్ని అందించలేదు. డియర్ కామ్రేడ్ కూడా అంతంత మాత్రమే ఆడింది.

Read More: Rashmika Viral Video: రష్మిక బోల్డ్ వీడియో వైరల్… కేసు వేయాల్సిందే అంటున్న బిగ్ బి

ఆ వెంటనే మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు ఎవరు సినిమాలో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత వచ్చిన భీష్మ సినిమా కూడా మంచి పేరును సాధించి పెట్టింది. ఇప్పటివరకు రష్మిక ఎన్ని సినిమాలు చేసినా కూడా రష్మిక అంటే టక్కును గుర్తుచేసిన “పుష్ప”. పుష్ప సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా, ఇంతా కాదు కేవలం తెలుగులోనే కాదు, పుష్ప సినిమా స్థాయి, స్టామినా ఏంటో ప్రపంచం మొత్తం చూసింది.

- Advertisement -

ఆ సినిమా తర్వాత తమిళ్ లో కూడా స్టార్ హీరో విజయ్ వారిసు సినిమాలో అద్భుతమైన అవకాశాన్ని అందుకొని అక్కడ కూడా ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం రష్మిక చేస్తున్న సినిమా యానిమల్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి డిసెంబర్ 1 ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

Read More: Rashmika: క్యాస్టింగ్ కౌచ్ పై రష్మిక ఓపెన్ – నేనూ బాధితురాలినే..!

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిదానిలో చెడు మంచి ఉన్నట్లు కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించి కూడా కొన్ని కొన్ని అభ్యంతరకరమైన పనులు చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు. రీసెంట్ గా ఒక వీడియో బాగా వైరల్ అయింది. నిజంగా ఆ వీడియోలో ఉన్నది రష్మిక అని దాదాపు తెలియని వాళ్ళంతా అనుకున్నారు. కానీ అది ఒక మార్ఫింగ్ వీడియో అని రీసెంట్ గా బయటపడింది దీంతో చాలామంది సెలబ్రిటీలు రష్మిక వైపు నిలబడి రష్మికకి మద్దతు ఇస్తున్నారు. ఈ పోస్ట్ పై రష్మిక కూడా ఆల్రెడీ స్పందించింది.

ఒక సెలెబ్రిటి ఇలా జరుగుతున్న తరుణంలో అమితాబ్ బచ్చన్ సాబ్ దగ్గరనుంచి, నాగచైతన్య , సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోస్ కూడా దీనిపై స్పందించి రష్మిక వైపు నిలబడటం అనేది మంచి విషయం అని చెప్పాలి. ఇలా సెలబ్రెటీలకు కష్టం వచ్చినప్పుడు తోటి వాళ్లు నిలబడటం ఇండస్ట్రీకి మంచిది అని అంటున్నారు సినీ క్రిటిక్స్.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు