Anushka Shetty: చిరును రిజెక్ట్ చేసి… సీక్వెల్‌కి సై !

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి నేడు 42వ పుట్టిన రోజును జరుపుకుంటుంది. నిశ్శబ్ధం సినిమా తర్వాత సిల్వర్ స్క్రిన్ కి గ్యాప్ తీసుకున్న అనుష్క… రీసెంట్ గా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస సినిమాలకు రెడీ అవుతుందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

Read More: Anushka: సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అవుతున్న అనుష్క

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఓ సినిమాలో అనుష్కకు ఛాన్స్ వచ్చిందని కూడా టాక్ వచ్చింది. అంతే కాదు, మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన వెల్లడించబోతున్నారని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా వినిపించింది. అయితే అనుష్క శెట్టి పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన అప్డేట్ ఈ వార్తకు బ్రేక్ వేసింది. అనుష్క తన 50వ సినిమాగా భాగమతి 2 వస్తుందని ఈ రోజు ఉదయం అధికారక ప్రకటన వచ్చింది.

- Advertisement -

లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా 2018లో వచ్చిన భాగమతి సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. బాహుబలి సినిమా తర్వాత వచ్చిన విజయం కావడంతో అనుష్కకు ఈ భాగమతి సినిమా చాలా స్పెషల్ అందుకే. తన 50వ సినిమాగా భాగమతికి సీక్వెల్ ను తీసుకురాబోతున్నారు. అయితే 50వ సినిమాగా భాగమతి 2 రావడం మంచి విషయమే. కానీ, ప్రస్తుతం అనుష్కకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా అవసరం.

Read More: అనుష్క శెట్టి ఇంత సంపాదించిందా.. ఆమె ఆస్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే !

స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చి, ఇండస్ట్రీలో తన స్థానాన్ని మళ్లీ తెచ్చుకోవడానికి కమర్షియల్ సినిమాలు మంచి ఆప్షన్. అలాంటి అవకాశం చిరంజీవి మూవీతో అనుష్కకు వచ్చింది. ఆ మూవీ రిజెక్ట్ చేయకుండా ఉంటే బాగుంటుందని అనుష్క అభిమానులు కోరుకుంటున్నారు. భాగమతి 2 తీస్తూనే, మెగాస్టార్ చిరంజీవి సినిమాకు కూడా సైన్ చేయాలని అంటున్నారు. చూడాలి మరీ బర్త్ డే బ్యూటీ మెగా స్టార్ చిరంజీవి సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు