Ram Charan New Movie: జాన్వీ హీరోయిన్‌గా కాదు… స్పెషల్ సాంగ్ కోసం?

జాన్వీ కపూర్…. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. “ధడక్” అనే సినిమాతో హిందీ చిత్రసీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్ ఉండటంతో పాటు అందాల ఆరబోతలో కూడా ఏ మాత్రం తగ్గకపోవడంతో క్రేజ్ ఇట్టే పెరిగిపోయింది. ఇక ఇది ఇలా ఉంటే… ఈ భామ హిందీలో వరుస సినిమాలు చేస్తున్న అనుకున్న బ్రేక్ రావడం లేదు. చేసిన సినిమాలన్నీ హిట్ దరిదాపుల్లోకి కూడా రావడం లేదు.

Read More: RC16 : జగదేక వీరుడు అతిలోక సుందరిని గుర్తు చేస్తారా ?

ఇప్పటికే ఎన్టీఆర్ 30వ మూవీ ”దేవర” లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ సౌత్ లో మరో ఇద్దరూ బడా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. అలా తన క్రేజ్ ను బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ పెంచుకోవాలని చేస్తుంది. అందుకు సోషల్ మీడియాను కూడా వాడుకుంటుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఫోటోషూట్ లతో పాటు అప్పుడప్పుడు తన వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటుంది.

- Advertisement -

Read More: #RC16: బుచ్చిబాబు క్రేజీ ప్లాన్ – పాన్ ఇండియా వర్కౌట్ అవుతుందా..? 

ఇక తాజాగా జాన్వి స్పెషల్ సాంగ్ చేయనుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని…. అయితే ఈ పాట కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. అయితే ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి జాన్వీ కపూర్ ఒప్పుకుంటుందా? లేదా? అనేది చూడాలి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు