NBK109: బాలయ్య ఇంకెన్నీ రోజులు… అవి లేకుంటే పని అవ్వదా?

నట సింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నట వారసుడిగా రెండో తరం టాప్ హీరోల్లో ఒకడిగా నిలిచిన బాలయ్య ఇప్పటికి తన సినిమాల ద్వారా అభిమానుల్ని విశేషంగా అలరిస్తున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా యంగ్ హీరోలకి పోటీనిస్తున్న బాలయ్య, సినిమాల స్క్రిప్ట్ సెలక్షన్స్ మాత్రం ఇతర హీరోల కన్నా రొటీన్ గానే ఉంటాయి.

అయితే కొందరు బాలయ్య అభిమానులు ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో బెటర్ సెలెక్షన్స్ బాలయ్యదే అని అనొచ్చు. కానీ కంటెంట్ పరంగా చూస్తే అన్ని రొటీన్ కథలే. ఆయా డైరెక్టర్లు తమ స్క్రీన్ ప్లే బలంతో సినిమాని హిట్ చేసారు. దానికి బాలయ్య పెర్ఫార్మన్స్ బోనస్. అయితే లుక్స్ పరంగా మాత్రం ఏజ్ కి తగ్గట్టు మైంటైన్ చేస్తుండడం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే బాలయ్య తో సినిమాలు తీసే డైరెక్టర్లు కూడా, బాలయ్య ని కొత్తగా చూపించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని సగటు అభిమాని ఆవేదన. ఎంత సేపు బాలయ్య అంటే డబుల్ యాక్షన్ పాత్రలు, ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు, సుమోలు లేపడం, వీటన్నిటికీ మించి గొడ్డలి ఆయుధం, సింహం డైలాగ్ పరమ రొటీన్ అయిపోయాయి.

- Advertisement -

ఇక ఈ ఇయర్ వచ్చిన వీర సింహారెడ్డి లో ఆ సింహం డైలాగ్, గొడ్డలి ఫైట్ సీన్స్ బాలయ్య ఫ్యాన్స్ కి కిక్కిచ్చినా, కామన్ ఆడియన్స్ కి అంతగా ఎక్కలేదు. ఇక తాజాగా బాలయ్య తో బాబీ చేస్తున్న సినిమా కూడా ఒక స్టిల్ తో అనౌన్స్ చేసారు. ఆ స్టిల్ లో వెపెన్ గా ఒక గొడ్డలి, దానిపైన సన్ గ్లాసెస్, ఒక తాయత్తు ఉంటుంది. ఈ స్టిల్ చూసిన ఫ్యాన్స్ ఇది కూడా ఆక్షన్ కమర్షియల్ సినిమా అని ఫిక్స్ అయిపోయారు.

అయితే బాలయ్య ని ఒక ఆదిత్య369 తరహా లో సాఫ్ట్ రోల్ లో చూద్దామని అభిమానులకి ఎప్పట్నుంచో ఆశ. ఆ ఆశ ఇప్పట్లో తీరేలా లేదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు