Gunturu kaaram: బాబు అలా… వచ్చాడు.. రికార్డు బద్దలైపోయింది!

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రాబోతున్న క్రేజీ సినిమాల్లో ఒకటి “గుంటూరు కారం”. ఈ సినిమాపై అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలున్నాయి. అసలు సినిమా అనౌన్స్ చేసినపుడే ఈ సినిమాపై సాలిడ్ బజ్ స్టార్ట్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబో లో వస్తున్న మూడో సినిమా కాబట్టే ఈ హైప్ సాధ్యమైందని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమా టైటిల్ దగ్గరి నుండి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ దాకా ఒక్కోటి ఒక్కో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఇక ఈ సినిమా నుండి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ కూడా యూట్యూబ్ లో ఓ రేంజ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. మహేష్ బాబు ని ఎలివేట్ చేస్తూ ఉన్న ఈ పాట అటు లిరిక్స్ పరంగా, మ్యూజిక్ పరంగా సాలిడ్ గా ఉందంటూ ఫ్యాన్స్ నుండి కితాబు కూడా వచ్చేసింది. ఇంకేముంది.. అలా యూట్యూబ్ లో రిలీజ్ చేసారు.. ఇలా రికార్డులు చెల్లాచెదురైపోయాయి.

“దమ్ మసాలా” అంటూ రిలీజ్ చేసిన ఈ సాంగ్ 24 గంటల్లో 17.42 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని లిరికల్ సాంగ్స్ లో అల్ టైం రికార్డ్ సెట్ చేసింది. ఇంతకు ముందు కూడా మహేష్ పెన్నే సాంగ్ 16.38 మిలియన్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, చిన్న మార్జిన్ తో దాన్ని బ్రేక్ చేసాడు. ఇదే కాదు వీటి తర్వాత స్థానంలో ఉన్న మరో రెండు పాటలు కూడా మహేష్ ఖాతాలోనివే.

- Advertisement -

ఇక ఈ సినిమా పాటలు థమన్ మహేష్ కి ఇచ్చిన దూకుడు ని మించి ఉంటాయని పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే. మరి గుంటూరు కారం వచ్చే లోపు ఇలాంటి రికార్డులు మరెన్ని క్రియేట్ అవుతాయో, బాబు ఖాతాలో మరిన్ని పడతాయో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు