NBK109: బాబాయ్ అబ్బాయి క్లాష్? చిచ్చు తప్పదా?

టాలీవుడ్ లో నందమూరి కుటుంబం లో ఉన్న ఫ్యామిలి వివాదాలు అందరికి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని గత కొన్నాళ్లుగా పట్టించుకోవట్లేదని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల్ని బట్టి ఎవరికైనా తెలిసిపోతుంది. ఎన్టీఆర్ 100 ఇయర్స్ కి ఎన్టీఆర్ ని పిలవకపోవడం, రీసెంట్ గా చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ పట్టించుకోకుండా ఉండడం ఇవన్నీ నందమూరి ఫ్యాన్స్ కి లేనిపోని అనుమానాల్ని ఎక్కువ చేస్తున్నాయి. ఒక రకంగా ఫ్యామిలీలో అందరూ ఒక్కటే అని బయటికి చెప్తున్నా ఇలా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ లో బయట పడుతూనే ఉంటాయి.

ఇదిలా ఉండగా లేటెస్ట్ గా సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ట్రెండ్ అవుతుంది. అదేంటంటే బాలకృష్ణ బాబీ కాంబో లో తెరకెక్కుతున్న సినిమా 2024 లో మార్చి 29న రిలీజ్ అవబోతుందని నెట్టింట వార్త వైరల్ అవుతుంది. ఎందుకంటే మార్చి 28న బాలకృష్ణ బ్లాక్ బస్టర్ లెజెండ్ రిలీజ్ అయ్యి పదేళ్లు పూర్తి కావస్తుంది. ఈ సందర్బంగా మేకర్స్ ఆరోజు NBK109 సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారని టాక్ నడుస్తుంది.

అయితే సరిగ్గా వారం గ్యాప్ లో ఏప్రిల్ 5న ఎన్టీఆర్ నటిస్తున్న “దేవర” రిలీజ్ కానుంది. అంటే వారం రోజుల తేడా తో బాబాయ్ అబ్బాయి సినిమాలు క్లాష్ అవనున్నాయన్నమాట. ఇదే జరిగితే నందమూరి ఫ్యాన్స్ మధ్య చిచ్చు తప్పదనే ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

- Advertisement -

అయితే NBK109 రిలీజ్ డేట్ విషయంలో ఈ వార్త నిజమో కాదో క్లారిటీ లేదు. ఈ విషయంపై మేకర్స్ ముందు క్లారిటీ ఇవ్వాలని నందమూరి అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు