Mahesh Babu: గుంటూర్ ని గుద్ది పడేయడానికి వచ్చేస్తున్నాడు!

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో చేస్తున్న సినిమా “గుంటూరు కారం”. వీళ్ళ కాంబో లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడం వల్ల సినిమాపై అభిమానులతో పాటు, కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలున్నాయి. ఇక గుంటూరు కారం నుండి వచ్చిన ఫస్ట్ లుక్ నుండి ఫ్యాన్స్ ద్రుష్టి లో ఓ రేంజ్ లో అంచనాలు పెరగగా, టీజర్ కూడా మెప్పించడంతో అభిమానులు సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. పైగా మహేష్ నుండి ఒక ఊర మాస్ సినిమా వచ్చి చాలా రోజులైంది.

ఇక ప్రేక్షకుల అంచనాలకి తగ్గట్టే ఈ సినిమా కూడా సంక్రాంతి కి దుమ్ములేపడానికి సిద్ధం అవుతుంది. తాజాగా గుంటూరు కారం ఫస్ట్ లిరికల్ సాంగ్ ని కూడా రిలీజ్ చేసారు.

“ధమ్ మాసాల అంటూ మాస్ ట్యూన్స్ తో రిలీజ్ అయిన ఆ సాంగ్ మాస్ జనాల్ని ఉర్రుతలూగిస్తుంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ క్యాచీ గా ఉండగా, ఆ ట్యూన్స్ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఉంటే, దానికి తగ్గట్టు థమన్ ఇచ్చిన బీజీఎమ్ అద్దిరిపోయింది.

- Advertisement -

వీటన్నిటికి మించి సాంగ్ లో అక్కడక్కడా మహేష్ ని త్రివిక్రమ్ తన స్టైల్ లో చూపిస్తూ ఇచ్చిన ఎలివేషన్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ సీన్స్ లో మహేష్ రగ్గడ్ లుక్ లో లైట్ గడ్డం మీసంతో బీడీ కాలుస్తుంటే థియేటర్లో విజిల్స్ పడడం గ్యారెంటీ.. ఓవరాల్ గా త్రివిక్రమ్ బర్త్ డే కి మహేష్ ఫ్యాన్స్ కి సాలిడ్ ట్రీట్ వచ్చిందన్నమాట!

ఇక గుంటూరు కారం వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు