Pawan Kalyan Movies: పవనేశ్వరా… మిమ్మల్ని నమ్ముకుని తప్పుచేశామయ్యా..!

పవన్ కళ్యాణ్… ఈ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. దానికి ఓ లెక్క ఉంది. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కడుతారు. నిజానికి అలా కొంతమంది కట్టారు. సినిమాలకు సైన్ చేయించుకున్నారు. కానీ, ఇప్పుడు ఎందుకు చేశామయ్యా… అంటూ బాధపడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… వకీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత… వచ్చిన కథకి నో అని చెప్పకుండా.. అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చాడు. కానీ, ఇప్పుడు పవన్ సినిమాలు చేయడానికి రాజకీయ పరిస్థితులు అడ్డొస్తున్నాయి.

ప్రస్తుతం పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు పరిస్థితి చూస్తే.. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది… అన్నింటి కంటే, ఫస్ట్ స్టార్ట్ చేసింది హరి హర వీరమల్లు. ఎక్కువ డేట్స్ కూడా ఇదే మూవీకి ఇచ్చాడు. కానీ, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది కంప్లీట్ అవుతుందా అనే గ్యారంటీ కూడా లేదు. అంత ఎందుకు ఈ సినిమా మళ్లీ సెట్స్ పైకి వస్తుందా లేదా అనేది కనీసం ఆ మూవీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడికే
కూడా క్లారిటీ లేదు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై బాలయ్య కూతురు ఇంట్రెస్టింగ్ కామెంట్

- Advertisement -

ఇక OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు రెండు సినిమాలకు పవన్ అవసరం ఉంది. మరి కొన్ని డేట్స్ ఇస్తే పవన్ పాత్రకు సంబంధించి గుమ్మడికాయ కొట్టేయొచ్చు. కానీ, ఇప్పటికే మనం అనుకున్నట్టు రాజకీయ పరిస్థితులు అడ్డొస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల గంట మొగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేస్తుంది. అంటే.. పవన్ ప్రచార రథం ఎక్కబోతున్నాడు.

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పట్లో ఎన్నికలు లేకున్నా… రాజకీయ వేడి మాత్రం ఎప్పుడూ ఉంటుంది. అందులోనూ ఇటీవల చంద్రబాబు అరెస్ట్.. ఇప్పుడు మెడికల్ సమస్యలపైన విడుదల అవ్వడం లాంటి అంశాలతో పవన్ సినిమాలకు టైం ఇచ్చే పరిస్థితి లేదు. జనవరిలో ఏపీలో ఎన్నికలు ఉండబోతున్నాయి. అంటే… మార్చి, జూన్ వరకు పవన్ కళ్యాణ్ కు టైం ఉండదు. అంటే అప్పటి వరకు పవన్ దర్శకులు ఖాళీనే.

Pawan kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో విలన్‌గా స్టార్ డైరెక్టర్?

అందుకే డైరెక్టర్లు… పవనేశ్వరా… మిమ్మల్ని నమ్మి తప్పు చేశామయ్యా అని అనుకుంటున్నారట. అందులో ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పరిస్థితి అయితే మరీ దారుణం. ఆయన చివరి సినిమా 2019లో (గద్దలకొండ గణేష్) వచ్చింది. దీని తర్వాత నుంచే పవన్ కోసం తిరుగుతున్నాడు హరీష్. కొన్ని రోజుల క్రితమే పవనేశ్వరుడు కరుణించి సినిమాకు టైం ఇచ్చాడు.

కానీ, ఇప్పుడు మళ్లీ ఎప్పుడు వస్తాడో తెలిదు. అందుకే హరీష్ పవన్ ను వదిలేసి, రవితేజను నమ్ముకోబోతున్నాడు. ఇక సురేందర్ రెడ్డి కూడా పవన్ కోసం చాలా రోజులు వెయిట్ చేశాడు. ఇక ఇది అయ్యేలా లేదని, సూర్యతో పాటు మరో హీరోకు కథలు వినిపించి, వారిని ఒప్పించే పనిలో ఉన్నాడు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు