Pawan kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో విలన్‌గా స్టార్ డైరెక్టర్?

Pawan kalyan

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. రీమేక్ సినిమా అయినా, హరీష్ శంకర్ పై ఉన్న నమ్మకంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ చేసిన రీమేక్ చిత్రం గబ్బర్ సింగ్ ఎలాంటి విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. అంతే కాదు, రీమేక్ లను సినిమాలను తన స్టైల్ మార్చి తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కిస్తాడని హరీష్ కి మంచి పేరు ఉంది. అందుకే హరీష్ శంకర్ రీమేక్ కింగ్ అంటారు. అలా ఉస్తాద్ భగత్ సింగ్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ మూవీ ఇటీవలే ఒక చిన్న షెడ్యూల్‌ని స్టార్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ పై పలు కీలక సన్నివేశాలను షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ హైదరాబాద్ చుట్టు పక్కలే జరుగుతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతుంది. ఈ సినిమా లో విలన్ పాత్ర కోసం ఒక స్టార్ డైరెక్టర్ ని హరీష్ శంకర్ దింపుతున్నాడట. ఆయన ఎవరో కాదు, తమిళంలో మంచి దర్శకుడిగా, నటుడిగా దాదాపు మూడు దశాబ్ధాల నుంచి ఓ వెలుగు వెలుగుతున్న పార్థీబన్.

పార్థీబన్ ఇటీవల పొన్నియన్ సెల్వన్ లో కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన చిత్రం కార్తీ నటించిన యుగానికి ఒక్కడు. ఈ చిత్రంలో పార్థీబన్ చోళ రాజుగా పార్థీబన్ కనిపించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోనే తలబడటానికి రెడీ అయిపోయాడని సమాచారం. పార్థీబన్ పాత్ర ఫుల్ లెన్త్ ఉంటుందని తెలుస్తోంది. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తమిళంలో వచ్చిన తెరి కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. దానిలో విలన్ పాత్ర పెద్దగా ఉండదు. కానీ, ఇక్కడ విలన్ పాత్రను హరీష్ శంకర్ తెలుగు ప్రేక్షకుల టెస్ట్ కి తగినట్టు పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తున్నారట.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు