Hebah Patel: హెబ్బా కు ఇక అవే దిక్కు అయ్యేలా ఉన్నాయి !

Hebah Patel

టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ కు ఇటీవల కాలంలో సినిమా అవకాశాలు రావడం బాగా తగ్గిపోయాయి. కుమారి 21 ఎఫ్ సినిమా తరువాత టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన హెబ్బా చేతికందొచ్చినా అడపాదడపా సినిమాలన్నీ ఒప్పుకుంటూ చేయడం వల్ల ఆమె కెరీర్ ప్రస్తుతం చిక్కుల్లో పడిపోయింది.

టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన హెబ్బా పటేల్ కు ప్రస్తుతం ఐటెం సాంగ్స్ , వెబ్ సిరీస్ లే దిక్కు అవుతున్నాయి. దాంతో హెబ్బా పటేల్ కొన్ని సినిమాలలో నైతే ఏకంగా ఏమాత్రం ప్రాధాన్యం లేని క్యారెక్టర్లు కూడా చేస్తూ వస్తుంది. అయితే హెబ్బా చేతిలో ప్రస్తుతం పెద్ద సినిమాలేవి లేకపోయినా కూడా ఓటిటి లో మాత్రం ఈ హీరోయిన్ కెరీర్ మంచి ఊపులోనే ఉందని చెప్పాలి. 2021 లో రామ్ హీరోగా వచ్చిన రెడ్ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన తరువాత హెబ్బా పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇక అప్పుడే ఆమె ఆహా లో ఓదెల రైల్వే స్టేషన్ అనే ఓటిటి సినిమాలో నటించింది. ప్రముఖ డైరక్టర్ సంపత్ నంది ప్రెజెంట్ చేసిన ఈ సినిమా ఆహా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. దాంతో హెబ్బా పటేల్ఒక్కసారిగా ఓటిటి స్పెస్ లో బిజీ హీరోయిన్ గా మారింది.

ఇటీవలనే హెబ్బా పటేల్ జీ 5 లో వచ్చిన వ్యవస్థ అనే వెబ్ సిరీస్ లో నటించింది. వ్యవస్థ సిరీస్ కూడా జి5లో మంచి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకోంది.ఇక ప్రస్తుతం హెబ్బా పటేల్ ఆహాలో రాబోతున్న గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే సినిమాలో నటించింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక రియల్ లైఫ్ సూసైడ్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకొని ఈ సినిమా ఉండబోతుంది. రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ ఈ సినిమాలో జంటగా నటించారు.

- Advertisement -

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 6 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. హెబ్బా పటేల్ కెరీర్ చూస్తుంటే ఆమెకు థియేటర్స్ లో ఆడే సినిమా అవకాశాలు రాకున్నా, ఓటిటిలో మాత్రం మంచి అవకాశాలే వస్తున్నయనిపిస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు