Vyavastha: ఇంస్టాగ్రామ్ లో ఆ వ్యక్తికి ఐ లవ్ యు చెప్పిన హెబ్బా

తెలుగులో రాహుల్ రవీంద్రన్ , షాని ,వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలలో వచ్చిన అలా ఎలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్ అతి తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె నటించిన కుమారి21ఎఫ్ సినిమా 2018లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. 6కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 38కోట్ల వసూళ్ళని రాబట్టింది.ఈ సినిమాతో హెబ్బా పటేల్ టాలీవుడ్ లో ట్రేండింగ్ హీరోయిన్ అయిపోయింది.

అయితే హెబ్బా పటేల్ కుమారి 21ఎఫ్ సినిమా సక్సెస్ తరువాత వెంట వెంటనే సినిమాలు చేస్తూ బిజీ అయిపొయింది. ఈ సినిమా తరువాత ఈమె రాజ్ తరుణ్, మంచు విష్ణు హీరోలుగా ఆడో రకం, ఈడో రకం సినిమా చేసింది. అప్పటికే రాజ్ తరుణ్,హెబ్బా పటేల్ పెయిర్ కి మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత రిలీజ్ అయిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా కూడా హెబ్బా సక్సెస్ ని ముందుకి తీసుకెళ్లింది. ఇక హ్యాట్రిక్ సక్సెస్ లతో దూసుకుపోయిన ఈ భామ కెరీర్ కి ఒక్కసారిగా నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాతో బ్రేక్ పడింది.ఇక తరువాత నుంచి హీరోయిన్ గా ఆఫర్స్ కరువైన హెబ్బా పటేల్ చిన్న, చిన్న క్యారెక్టర్ లు, ఐటెం సాంగ్స్ చేస్తూ వస్తుంది.

ఇదిలా ఉండగా హెబ్బా తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ స్టొరీలో ప్రణయ్ అనే ఒకబ్బాయిని ట్యాగ్ చేసి ఐ లవ్ యు ప్రణయ్ అని స్టొరీ పెట్టింది. హెబ్బ స్టొరీ ని చూసిన అందరు ఒక్కసారిగా షాకై హెబ్బ కూడా లవ్ పడిపోయింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం స్టార్ట్ చేసారు.  అయితే అందరు హెబ్బ ని లవ్ లో పడేసిన ఆ ప్రణయ్ ఎవరై ఉంటారని ఆరా తీయడం కూడా స్టార్ట్ చేసారు. గతంలో ఈమె పై కొంత మంది స్టార్ట్ హీరోలతో లవ్ ట్రాక్ నడిపింది అని వార్తలు రావడంతో ఎవరి పేరు బయటికోస్తుందా ఆశగా చూసారు అందరు.

- Advertisement -

అయితే ఆ అబ్బాయి ఎవరో తెలిసిన తర్వాత సెర్చ్ చేసిన హెబ్బ ఫ్యాన్స్ కి ఎం చేయాలో పాలుపోలేదు. ప్రస్తుతం హెబ్బ పటేల్ జీ5 నిర్మాణంలో ఆనంద్ రంగ దర్శకత్వంలో వచ్చిన వ్యవస్థ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా ఆమెకి ప్రణయ్ జైట్లీ అనే ప్రముఖ స్టైలిస్ట్ ఆమెకి స్టైలింగ్ చేసారు. మరి హెబ్బకి ప్రణయ్ చేసిన స్టైలింగ్ బాగా నచ్చిందేమో ఏమో కానీ ఇంస్టాగ్రామ్ లో అతని ప్రొఫైల్ టాగ్ చేసి ఐ లవ్ యు ప్రణయ్ అని స్టోరీ పెట్టింది. దాంతో ప్రణయ్ అంటే ఏ స్టార్ యాక్టర్ అయ్యుంటాడో అనుకున్న వాళ్ళు  స్టైలిస్ట్ అని అర్థం చేసుకొని నీరాశ చెందారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు