Tollywood: అక్కినేని వారికి బ్యాడ్ టైం నడుస్తోందా..?

టాలీవుడ్ ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ హిట్స్ తో దూసుకుపోతుంటే అక్కినేని ఫ్యామిలీ మాత్రం బ్యాడ్ టైమ్ తో సతమతం అవుతుంది. అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురికీ ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ హిట్ లేకపోవటం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. నాగార్జున కి రీసెంట్ గా ఘోస్ట్ సినిమా రూపంలో డిజాస్టర్ ఎదురైతే, నాగచైతన్య కి థాంక్యూ రూపంలో డిజాస్టర్ వచ్చింది. ఇక తాజాగా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ సినిమా తొలి ఆట నుండే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకొని అఖిల్ కి మరో డిజాస్టర్ తెచ్చి పెట్టింది.

అఖిల్ ఈ సినిమా కోసం రెండేళ్లకు పైగా సిక్స్ ప్యాక్ మైంటైన్ చేసి పడ్డ కష్టం అంతా వృధా అయ్యింది. విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత అంతటి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న సినిమా ఏజెంట్ మాత్రమే అని చెప్పాలి. ట్రైలర్ రిలీజ్ అయ్యాక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా తొలి ఆట నుండే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంటుందని ఎవరూ ఉహించి ఉండరు.
ఈ క్రమంలో తమ అభిమాన హీరోలకు వరుస డిజాస్టర్స్ వస్తుండటం పట్ల అక్కినేని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, మే నెలలో నాగచైతన్య సినిమా ‘కస్టడీ’ విడుదల కానున్న నేపథ్యంలో ఆ సినిమా అయినా హిట్ అయ్యి అక్కినేని వారి డిజాస్టర్స్ పరంపర కి బ్రేక్ వెయ్యాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బ్యాడ్ టైమ్ అన్న కాన్సెప్ట్ ని తీసిపారేయలేం కానీ, కథల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని, బడ్జెట్, సినిమా ప్రమోషన్స్ వంటి అంశాల్లో జాగ్రత్త తీసుకుంటే ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ కాకపోయినా కనీసం యావరేజ్ గా అయినా మిగులుతుంది అన్నది అక్కినేని హీరోలు గమనించాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు