Gopichand: ఆ సినిమాను తలచుకొని బాధపడ్డ గోపీచంద్…!

గోపీచంద్ ప్రస్తుతం రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా మే 5న విడుదల కాబోతోంది. ఇటీవలి కాలంలో సరైన హిట్ లేని గోపీచంద్ కి ఈ సినిమా కీలకంగా మారింది. గోపీచంద్, శ్రీవాస్ డైరెక్షన్లో గతంలో లక్ష్యం, లౌక్యం సినిమాలు డీసెంట్ టాక్ సొంతం చేసుకోవటంతో రామబాణం సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ తేజ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో గోపీచంద్ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

గౌతమ్ నంద సినిమాపై తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని, ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎంతో బాధ కలిగిందని అన్నాడు. సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది 90శాతం మేకింగ్ సమయంలోనే తనకి అర్థం అవుతుందని ఆ విషయాన్ని రిలీజ్ కి ముందు ఎవరికీ చెప్పిన నమ్మరని అన్నాడు. గౌతమ్ నంద సినిమా మేకింగ్ విషయంలో కొన్ని లోపాలు ఉన్న మాట వాస్తవమే అని, వాటిని ప్రేక్షకులు క్షమిస్తారని అనుకున్నానని కానీ, అలా జరగలేదని అన్నారు. గౌతమ్ నంద సినిమా రిజల్ట్ చుసిన తర్వాత సినిమా రిజల్ట్ విషయంలో ఆతృతగా ఉండటం ఆపేసానని అన్నారు.

నిజానికి గౌతమ్ నంద మంచి విషయం ఉన్న సినిమానే అయినప్పటికీ ఏ కారణం చేతనో ఫ్లాప్ అయ్యింది. దీంతో పాటు పలు ఆసక్తికర అంశాలు వెల్లడించిన గోపీచంద్, రామబాణం సినిమా విషయంలో తనకి శ్రీవాస్ కి మధ్య విభేదాలు వచ్చాయన్న మాట అవాస్తవం అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి గోపీచంద్ కెరీర్ కి హిట్ కీలకం అన్న దశలో వస్తున్న రామబాణం సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు