NBK: బాలయ్య కోసం పూరి ఆగక తప్పదా..?

లైగర్ సినిమా డిజాస్టర్ కావటంతో డీలా పడ్డ పూరి ఇప్పుడిపుడే తేరుకొని కొత్త సినిమా కోసం సన్నాహాలు మొదలు పెడుతున్నాడు. ఇటీవల ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్ గా ‘కాక’ అనే సినిమా రానుంది అన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా, పూరి నెక్స్ట్ సినిమా విషయంలో ఇంకో ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటంటే, పూరి నెక్స్ట్ సినిమా బాలకృష్ణతో ఉండనుందని అందులోనూ రామ్ కోసం సిద్ధం చేసిన కథకి మార్పులు చేసి సినిమా చేయనున్నాడని వార్తలొస్తున్నాయి.

ఇంకా అధికారిక ప్రకటన రాని ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో లేదో చెప్పలేం కానీ, బాలయ్యతో సినిమా చేయాలంటే పూరి కనీసం ఏడాది పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కచ్చితంగా ఉంది. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బోయపాటి డైరెక్షన్లో 2024 ఎన్నికలే టార్గెట్ గా ఇంకో సినిమా ప్లాన్ చేసాడు బాలయ్య. ఈ క్రమంలో బాలయ్య లైనప్ లో ఉన్న సినిమాలు పూర్తీ కావాలంటే కనీసం ఏడాది కాలం పడుతుంది. పూరితో సినిమా కోసం ఎన్నికలే టార్గెట్ గా చేస్తున్న బోయపాటి సినిమాను పోస్ట్ ఫోన్ చేసే అవకాశం లేదు.

ఈ నేపథ్యంలో సినిమాను జెట్ స్పీడ్ లో పూర్తి చేసే పూరి బాలకృష్ణ కోసం అంత కాలం వేచి ఉంటాడా అన్న చర్చ నడుస్తోంది. అంతే కాకుండా రామ్ లాంటి యువ హీరో కోసం సిద్ధం చేసిన కథలో బాలయ్యకు తగ్గట్టు ఎలాంటి మార్పులు చేశారు అన్న ఆసక్తి కూడా నెలకొంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంతవరకు వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు