Rashmika: శ్రీలీల ప్లేస్ ను రీప్లేస్ చేసిన రష్మిక మందన్న

Rashmika

టాలీవుడ్ ట్రేండింగ్ హీరోయిన్ శ్రీలీల వరుసగా చేస్తోన్న సినిమాలలో ఒక సినిమా మైనస్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవలనే ఆమె ఒక యంగ్ హీరోతో చేయవల్సిన ఒక సినిమాను పక్కన పెట్టేసిందట.దీనికి కారణం ఆమె గ్యాప్ లేకుండా సినిమాలు చేయడమే అని తెలుస్తోంది.

శ్రీలీల ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ దాదాపు పెద్ద హీరోలవే అవడంతో ఆమెకు అన్నీ సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చేయడం ఇబ్బందిగా మారుతోంది. దాంతో ప్రస్తుతం ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలకు మొదటి ప్రేయార్టీ ఇచ్చి , ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలకు సెకండ్ ప్రేయార్టీ ఇస్తుందట ఈ యంగ్ హీరోయిన్. ఇక ఈ సమస్య వల్ల శ్రీలీల విజయ్ దేవరకొండ తో నటించవలసిన సినిమా నుంచి తప్పుకుందని టాక్ వినిపిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే జెర్సీ సినిమా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక చిత్రం రాబోతుంది. స్పై థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కొద్దీ రోజుల క్రితమే లాంఛనంగా ఓపెనింగ్ జరిగింది. ఇక రేపో మాపో షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వాల్సి ఉండగా విజయ్ మూవీ టీం కు శ్రీలీల డేట్స్ దొరకడం ఇబ్బందిగా మారిందట. ఆమె ప్రస్తుతం చేస్తోన్న భగవంత్ కేసరి సినిమాతో పాటు పలు సినిమాలు షూటింగులు మధ్యలో ఉండటం వల్ల ఆమె ఆ సినిమాల షూటింగ్ ఫినిష్ చేయడం అనివార్యం అయింది. దాంతో శ్రీలీల విజయ్ దేవరకొండ సినిమాకు డేట్స్ ఇష్యూ తలెత్తింది.

- Advertisement -

ఇక ఆ కారణం చేత శ్రీలీల విజయ్ దేవరకొండ సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం అందుతోంది. అయితే విజయ్, గౌతమ్ తిన్నానూరి ల సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంత ఆల్రెడీ ఫినిష్ అవడంతో వెంటనే సినిమా స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యం తో శ్రీలీల ప్లేస్ లో హీరోయిన్ గా రష్మిక తీసుకోడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నరట. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమా తప్ప వేరే సినిమాలేవీ చేయకపోతుండటంతో రష్మిక నే సినిమాలో తీసుకోనున్నట్టు టాక్. మరి ఈ సినిమా గనక రష్మిక ఒప్పుకుంటే టాలీవుడ్ హిట్ పెయిర్ గా ఉన్నవిజయ్ దేవర కొండ, రష్మిక జంటను మరోసారి తెరపై చూడోచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు