Deepika Padukone: రొమాంటిక్ సాంగ్స్ లో తగ్గదేలే.. అంటున్న హీరోయిన్

Deepika Padukone

సాధారణంగానే బాలీవుడ్ హీరోయిన్స్ రొమాంటిక్ సాంగ్స్, మరియు రొమాంటిక్ సీన్స్ అంటే చాలు రెచ్చిపోయి మరి నటిస్తారనే సంగతి అందరికి తెలిసిందే. ఇక అలాంటిది బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే ఇప్పుడు సడన్ గా రొమాంటిక్ సాంగ్స్ గురించి మాట్లాడాల్సిన అవసరమేం వచ్చింది అనుకుంటున్నారా.. అయితే మీకు అసలు విషయం తెలియాల్సిందే.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే గురించి అందరికి తెలిసిందే. ఇటీవలనే షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ సినిమా జవాన్ లో క్యామియో రోల్ లో కనిపించి ప్రేక్షకులను అలకరించిన దీపికా పదుకునే ప్రస్తుతం హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఫైటర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్షన్ డైరక్టర్ సిద్దార్థ్ ఆనంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది.

అయితే ఫైటర్ సినిమాకు సంబంధించి యాక్షన్ ఘట్టాలనన్ని తెరకెక్కించిన మూవీ టీం, ఇటలీలో ఒక సాంగ్ ను కూడా షూట్ చేయబోతున్నారట. హృతిక్ రోషన్, దీపికా పదుకునే ల మధ్య చిత్రీకరించనున్న ఈ సాంగ్.. రొమాంటిక్ గా ఉండబోతుందని టాక్. ఇక ఈ సాంగ్ కోసం దీపికా పదుకునే బ్యూటీ కనిపించేలా స్పెషల్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారట. ఈ ఏడాది ప్రథమార్థం లో వచ్చిన పఠాన్ సినిమాలో వచ్చిన బేషరం సాంగ్ ను తలపించేలా దీపికా పదుకునే ఈ సినిమాలోనూ ఈ రొమాంటిక్ సాంగ్ ద్వారా ఆమె అందాల కనువిందు చేయనుందట.

- Advertisement -

ఇక ఈ సినిమా రిలీజ్ విషయానికొస్తే దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక దీపికా పదుకునే తెలుగులో ప్రభాస్ కు జోడిగా కల్కి సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు