STR48: కోలీవుడ్ బాహుబలి సిద్దమవుతుంది

STR48: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఉన్న వ్యాల్యూ, తెలుగు సినిమాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయటం. ఒక మాస్ కమర్షియల్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టడం. ఇలా ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు సినిమా అంటే ప్రపంచం మొత్తం తమ వైపు చూసుకునేలా చేసింది. దీని కారణం ఎస్.ఎస్ రాజమౌళి. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు గుర్తింపును తీసుకొచ్చింది అని చెప్పొచ్చు.

అయితే బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలామందికి అలాంటి సినిమా తీయాలి అని ఒక ఊహ కూడా రాని తరుణంలో ఎస్ఎస్ రాజమౌళి ఒక అడుగు ముందుకేసి అసలు తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాలి అని అనుకున్నాడు. ఒక అద్భుతమైన కథను విజువల్ వండర్ గా చేసి, తెలుగు కథలకి తెలుగు సినిమాలకి ఉన్న ప్రాధాన్యతని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశాడు. బాహుబలి సినిమా వచ్చినంత వరకు కూడా ఇంత మార్కెట్ ఉంటుందని చాలామందికి తెలియదు.

ఇక బాహుబలి సినిమా కోసం ప్రభాస్ దాదాపు ఐదేళ్లపాటు తన కెరీయర్ని కేటాయించాడు. ఒక సినిమా కోసం ఐదేళ్లు తమ కెరియర్ని పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అయితే ప్రభాస్ అలా పెట్టడం వల్ల ప్రభాస్ కి కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ఆడియన్స్ అంతా క్యూరియాసిటీతో ఎదురు చూడటం మొదలుపెట్టారు. బాహుబలి తర్వాత చేసిన ప్రతి సినిమా కూడా 150 కోట్లకు పైగానే ప్రభాస్ కి వసూలు చేసి పెట్టింది. అయితే సరైన కంటెంట్ పడితే ప్రభాస్ మార్కెట్ ఏంటో మరోసారి రుజువు అవుతుంది.

- Advertisement -

ఇప్పుడు కోలీవుడ్ లో కూడా ఒక బాహుబలి లాంటి సినిమా నిర్మితమవుతుంది. అదే శింబు నటిస్తున్న 48వ సినిమా. కేవలం తమిళ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా శింబు ఎవరో తెలుసు. శింబు చేసిన చాలా సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలకు కూడా ఆడియన్స్ అప్పట్లో బ్రహ్మరథం పట్టారని చెప్పొచ్చు. ఇకపోతే శింబు నటిస్తున్న ఈ సినిమాలో శింబునే విలన్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఒక పిరియాడిక్ హిస్టారికల్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి డేసింగ్ పెరియార్ స్వామి దర్శకత్వం వహించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు గురించి ఇంకా అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు