Samantha : నన్ను కుక్క కంటే దారుణంగా చూశాడు.. చైతన్య పై సమంత కామెంట్స్ వైరల్..!

Samantha

అక్కినేని నాగచైతన్య – సమంత విడిపోయి ఏడాది దాటిపోయినా కూడా ఇప్పటికీ వీరి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. వారిద్దరూ అన్నీ మరిచిపోయి ఎవరి దారి వారు అన్నట్లు ఉన్నప్పటికీ కూడా జనాలు మాత్రం వీరి వ్యక్తిగత విషయాలను ఇంకా తవ్వుతూనే ఉన్నారు. విడాకుల ప్రకటన తర్వాత ఇద్దరూ వరుస సినిమాలను ప్రకటిస్తూ ముందుకు వెళుతున్నారు. కానీ వీరి వ్యక్తిగత జీవితాల గురించి ప్రతీసారి హైలైట్ చేస్తున్నారు కొందరు. ఇక సమంత ప్రస్తుతం ఖుషి సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది.

అయితే తాజాగా సమంతకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఓ సందర్భంలో దగ్గుబాటి రానా హోస్ట్ చేస్తున్న షో కి గెస్ట్ గా వెళ్లారు సమంత. ఆ షోలో సమంతను తన వ్యక్తిగత జీవితంలోని విషయాలతో పాటు నాగచైతన్యకు సంబంధించిన కొన్ని ఫన్నీ ప్రశ్నలు అడిగారు రానా దగ్గుబాటి. అంతేకాదు రానా అడిగిన ప్రశ్నలకి సమంత సైతం చాలా ఓపెన్ గా సమాధానాలు ఇచ్చింది.

ఈ క్రమంలోనే మీకు కుక్కలు అంటే చాలా ఇష్టం అనుకుంటాను..? అని రానా ప్రశ్నించారు. దీనికి సమంత సమాధానమిస్తూ.. “చాలా చాలా ఇష్టం. ఎన్ని కుక్కలైనా సరే పెంచుకోవాలని అనుకుంటాను. కానీ చైతుకి కుక్కలు అంటే అస్సలు ఇష్టం లేదు. ఆయన దృష్టిలో నేనే ఒక డాగ్ ని. చైతు బయటికి వెళ్ళేటప్పుడు, బయటనుంచి ఇంటికి వచ్చేటప్పుడు డాగ్ లాగా నేనే వెళుతూ ఆయనను పలకరించుకుంటాను. ఆయన నన్ను అస్సలు పట్టించుకోరు. ఇంట్లో నాది అలాంటి డాగ్ పరిస్థితి అని ఫన్నీగా చెప్పుకొచ్చింది” అయితే ఈ కామెంట్స్ ని కొందరు నెగిటివ్ గా క్రియేట్ చేసి సమంతను ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు