Samantha : సమంతకు మరో భయంకరమైన జబ్బు వచ్చిందా..?

Samantha

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఇక సమంత నాగచైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తరువాత విడాకులు వంటి విషయాలు మనకు తెలిసినవే. ఇక విడాకులు తర్వాత వీరిద్దరూ ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది సమంత.

ఇదిలా ఉంటే.. సమంత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఇందుకుగాను ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది సమంత. ఈ వ్యాధి వల్ల ఆమె ఎంతలా మారిపోయిందో మనం ఇప్పటికే చూశాం. ఆమె చాలా నీరసంగా ఉండి ముఖంలో కళ మొత్తం చేంజ్ అయిందని ఇప్పటికే చాలామంది కామెంట్స్ చేశారు. యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ వ్యాధి గురించి చెబుతూ కన్నీళ్లు కూడా పెట్టుకుంది సమంత. ఆమె వ్యాధి నుంచి కోలుకోవాలని ఎంతో మంది అభిమానులు ప్రత్యేక పూజలు కూడా చేశారు.

అయితే ప్రస్తుతం సమంత మరో వ్యాధి భారీన పడినట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రాణాంతకమైన జబ్బు కాదట. ఆమెకు విపరీతంగా కోపం వచ్చినప్పుడు మాత్రమే ఈ జబ్బు బయటపడుతుందట. అదేంటంటే సమంతకి కోపం వస్తే తన చేతిలో ఎంత విలువైన వస్తువులు ఉన్నా సరే నేలకేసి కొడుతుందట. ఎదుట ఎంత పెద్దవారు ఉన్నా సరే వారిని లెక్కచేయదట. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి సమంత సినిమా ఇండస్ట్రీకి దూరం కాబోతుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చూడండి

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు