Rukmini Vasanth: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మరో కన్నడ బ్యూటీ.. శ్రీలీల-రష్మికలను మించిన ఫిగర్..!

Rukmini Vasanth

నిన్న మొన్నటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ముంబై హీరోయిన్స్, లేదంటే మలయాళ హీరోయిన్లు అధిపత్యం కొనసాగించారు. అయితే ఎప్పటినుంచో వస్తున్న ఈ ఆనవాయితీని ఇటీవల కాలంలో బద్దలు కొట్టుకొని మరీ కన్నడ ముద్దుగుమ్మలు దూసుకెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో వస్తున్న ఏ సినిమాలో అయినా హీరోయిన్ ఎవరంటే శాండిల్ బ్యూటీ అనే చెబుతున్నారు. పెద్ద పెద్ద సినిమాల నుంచి చిన్న బడ్జెట్ సినిమాల వరకు ప్రస్తుతం వీరి హవానే నడుస్తుంది.

ఇలాంటి క్రమంలో ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న కన్నడ ముద్దుగుమ్మలకు షాక్ ఇస్తూ మరో కన్నడ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలోకి రాబోతుందంటూ ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ ముద్దుగుమ్మ పేరు రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి అనే డబ్బింగ్ మూవీ తెలుగు రాష్ట్రాలలో విడుదలైంది. కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాలోని మిగతా విషయాలు పక్కనపెడితే హీరోయిన్ మాత్రం యాక్టింగ్ తో తన మార్క్ చూపించింది.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలలో హీరో రక్షిత్ శెట్టిని డామినేట్ చేసే విధంగా ఆమె నటించిందంటూ ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే రుక్మిణి వసంత్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెంగళూరులోనే పుట్టి పెరిగింది ఈ ముద్దుగుమ్మ. లండన్ లో యాక్టింగ్ కోర్స్ పూర్తిచేసి 2019లో బీర్బల్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఓ మూడేళ్లపాటు ఎక్కడా కనిపించలేదు. ఇక ఈ ఏడాది మాత్రం భగీర, సప్త సాగరాలు దాటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఇక త్వరలోనే బాణదారియల్లీ అనే కన్నడ చిత్రంతో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే త్వరలోనే ఈ అమ్మడు కూడా తెలుగులో అవకాశాలు దక్కించుకొని రష్మిక, శ్రీలీలను మించిపోయే రేంజ్ లో ముందుకెళ్ళిపోతుందని చెప్పుకుంటున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు