Karna: బాహుబలి ని వదలని తమిళ తంబీలు- “కర్ణ:” టీజర్ రిలీజ్

యస్ యస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఫీవర్ కోలీవుడ్ ఇండస్ట్రీని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. బాహుబలి సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ బ్రేక్ చేయాలనీ, బాహుబలి సినిమాని మించిన సినిమా తీయాలని ఎప్పటికప్పుడు తమిళ్ ఫిలిం మేకర్స్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ ప్రయత్నలేవి ఫలించడం లేదనుకోండి అది వేరే విషయం.

ఇటీవలనే బాహుబలి సినిమాను టార్గెట్ చేస్తూ తమిళ్ లో మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే . భారీ బడ్జెట్ తో, ఐశ్వర్య రాయ్, విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష వంటి స్టార్స్ క్యాస్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత కేవలం తమిళ్ ప్రేక్షకులకు మాత్రమే ఆకట్టుకుంది. తెలుగు తో పాటు ఇతర భాషలలో ఈ సినిమా ఆశించినంత విజయ్ సాధించలేదు.

ఇక లేటెస్ట్ గా చూస్తే డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా కంగువ అనే చిత్రం రాబోతుంది. ఇటీవలనే ఈ సినిమాకు సంబంధించి టీజర్ కూడా రిలీజై, అందరిని ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ తో దాదాపు పది భాషల్లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా టార్గెట్ కూడా బాహుబలి బ్రేక్ చేయడమే. ఈ విషయాన్నీ స్వయంగా ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్న శివ నే మీడియా ముఖంగా చెప్పాడు.

- Advertisement -

అయితే సూర్య కంగువ సినిమాతో బాహుబలి సినిమాను టార్గెట్ చేస్తూ కోలీవుడ్ లో మరో సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరు సూర్యపుత్ర కర్ణ. చియాన్ విక్రమ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటిది కాదు చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయింది. కానీ కొన్ని కారణాల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దాంతో ఈ సినిమాను ప్రేక్షకులంతా దాదాపు మర్చిపోయారు.

ఇటీవలనే తంగళన్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన విక్రమ్ కొత్త సినిమాలేవీ కమిట్ అవకుండా మధ్యలో ఆగిపోయిన ఆయన సినిమాలైనా కర్ణ, ధ్రువ నక్షత్రంచిత్రాలను ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. ఇక ఈ రెండు సినిమాల ట్రైలర్ మరియు టీజర్ లు రిలీజ్ అయ్యాయి. క్యాలిటీ పరంగా చూస్తుంటే కర్ణ విజువల్స్ ప్రామిసింగ్ గానే ఉన్నాయి. బాహుబలి బీట్ చేయడానికి అన్ని రకాలుగా మూవీ టీం పకడ్బందీ ప్లానింగ్ వేసినట్టుగానే తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా తమిళ తంబీలు బాహుబలి ని బీట్ చేస్తారా లేదా అనేది చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు