PS2 : తెలుగులో మాట్లాడిన త్రిష

వర్షం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది త్రిష. పేరుకి తమిళ అమ్మాయి అయిన తెలుగులో ఈమెకి ఉన్న ఫాలోయింగే వేరు.జోడీ అనే తమిళ్ సినిమాలో చిన్న సైడ్ క్యారెక్టర్ చేసిన త్రిష కొద్దిరోజుల్లోనే స్టార్ట్ హీరోయిన్ గా మారిపోయింది. అందం ,అమాయకత్వం అందరిని అలరించే అభినయంతో త్రిష ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది.

అయితే ఈ మధ్య త్రిష తెలుగు సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది.అప్పుడప్పుడు రిలీజ్ అయ్యే తమిళ్ డబ్ సినిమాలతో పలకరించడం తప్ప స్ట్రయిట్ తెలుగు సినిమా చేసి చాలా కాలం అయింది.త్రిష తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా సినిమాలని తగ్గించింది. చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూ వస్తుండటం వల్ల ఇక త్రిష సినిమా కెరీర్ అయిపొయింది అనుకున్నారు. అప్పుడే 2018 లో వచ్చిన 96 సినిమా త్రిష కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు.

ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్ళని రాబట్టింది. తెలుగులో కూడా ఈ సినిమా రీమేక్ చేద్దామని దిల్ రాజు అనుకున్నప్పుడు త్రిషనే తీసుకుందామనుకున్నారంట ,ఎందుకంటే త్రిషకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అది కాక తెలుగు తెరపై త్రిష చాలా కాలంగా కనిపించట్లేదు అని దిల్ రాజు ఈ డెషిషన్ తీసుకున్నారంట కానీ డేట్స్ కారణంగా త్రిష ఈ ప్రాజెక్ట్ చేయలేదు.

- Advertisement -

త్రిష గత ఏడాది వచ్చిన PS1 సినిమాలో కనిపించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సెకండ్ పార్ట్ ని ఈ నెల 28 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు ఈ సందర్బంగా ఆదివారం రోజున జరిగిన PS2 ప్రి రిలీజ్ ఈవెంట్ లో త్రిష తెలుగులో అందరు బాగున్నారా అంటూ పలకరించింది. అలాగే ఆమె వర్షం సినిమా రోజులని గుర్తుచేసుకొని యాంకర్ సుమతో కాసేపు సరదాగా మాట్లాడారు.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు