Custody: అందరికి హిట్లొస్తున్నాయ్.. ఈ బ్యూటీకి కూడా వస్తుందా ?

“ఉప్పెన” సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ కొట్టింది కన్నడ బ్యూటీ కృతి శెట్టి. ఫస్ట్ సినిమా తోనే యూత్ ని ఆకట్టుకొని వాళ్ళ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది. అయితే ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ మళ్ళీ తనకి ఇప్పటి వరకు రాలేదు. ఆ సినిమా తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు హిట్ అయినా ఉప్పెన రేంజ్ హిట్లు కాదు. పైగా అందులో తనది సెకండ్ హీరోయిన్ మాత్రమే. ఈ సినిమాల తర్వాత కృతి శెట్టికి ఒక్క హిట్ కూడా రాలేదు. హీరోయిన్ గా చేసిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు తనకి ఒక భారీ హిట్ పడాలి. లేదంటే టాలీవుడ్ లో తన కెరీర్ నిలబడడం కష్టమవుతుంది. అదీగాక కృతి శెట్టి చాలా పొట్టిగా ఉండడం వల్ల పెద్ద హీరోలతో వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

టాలీవుడ్ లో కృతి శెట్టి లాగా రెండు మూడేళ్ళ కిందట ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు సూపర్ హిట్లు కొట్టేసారు. ధమాకా తో శ్రీ లీల, విరూపాక్ష తో సంయుక్త మీనన్ హిట్లు కొట్టారు. ఇంకా లేటెస్ట్ గా దసరా తో కీర్తి సురేష్ కం బ్యాక్ హిట్ ఇచ్చింది. అలాగే ఇప్పుడు కృతి శెట్టి కి కూడా ఒక మంచి హిట్ కావాలి.

ప్రస్తుతం కృతి శెట్టి కస్టడి సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా లో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు ద్విభాషా చిత్రంగా ఈ సినిమాను తెలుగు తమిళం లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు టీజర్ సినిమా పై అంచనాల్ని రెట్టింపు చేశాయి. మే 12 ఈ సినిమా విడుదల అవుతుంది. మరి ఈ సినిమా తోనైనా కృతి శెట్టి కి హిట్ పడి తన కెరీర్ గాడిలో పడుతుందా లేదా అన్నది కస్టడీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు