NTR30: జాన్వీకి హైట్ ఎక్కువ ఉన్నవాడే కావాలంట.. రీజన్ ఏంటో.. ?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తన అంద చందాలతో కుర్రకారుకి పిచ్చేక్కిస్తుంది. సోషల్ మీడియాలో తన అందంతో ఫుల్ మీల్స్ పెడుతూ.. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను పెంచుకుంది. ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ హిట్స్ లేకున్నా, వరుసగా అవకాశాలు వస్తున్నాయంటే, అది ఆమెకు ఉన్న అందాన్ని బట్టే అని చెప్పొచ్చు.

ఎన్టీఆర్30తో సౌత్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ, మరో తెలుగు సినిమాలో కూడా నటించడానికి చర్చలు జరుగతున్నాయని తెలుస్తుంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న RC16లో హీరోయిన్ గా జాన్వీ కి ఛాన్స్ వచ్చిందని టాలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్త నిజమే అయితే, టాలీవుడ్ లో ఈ బ్యూటీకి తిరుగుఉండదని చెప్పొచ్చు. ప్రస్తుతం కెరీర్ బిల్డ్ చేసుకోవాల్సిన ఈ 26 ఏళ్ల నటి, అప్పుడే పెళ్లి గురించి మాట్లాడుతుంది. తాజాగా ఒక సందర్భంలో తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో.. కొన్ని లక్షణాలను చెప్పింది.

జాన్వీని పెళ్లి చేసుకోబోయే వాడు.. ముందుగా తన వృత్తిని గౌరవించాలని అంటుంది. తన వృత్తిని గౌరవించే వారికే తొలి ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చింది. అలాగే మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలని, తనను కేరింగ్ గా చూసుకోవాలని కండీషన్స్ పెట్టింది. ఇక అన్నింటికి కన్న ముఖ్యంగా హైట్ ఇంపార్టెంట్ అని చెప్పింది. తనకు కాబోయే వాడు.. తన తండ్రి బోనీ కపూర్ కంటే హైట్ గా ఉండాలని చెప్పుకొచ్చింది. కాగా జాన్వీ చెప్పిన క్వాలిటీస్ తమలో ఎంత వరకు ఉన్నాయో అంటూ కుర్రకారు చెక్ చేసుకుంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు