Boxoffice: ఇటు సెంచరీ, అటు డబుల్ సెంచరీ.. తగ్గట్లేదుగా

పొన్నియన్ సెల్వన్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ సినిమా మొదటి భాగం 2022 సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. PS 1 వరల్డ్ వైడ్ గా 460కోట్లకి పైగా వసూలు చేసింది. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ యొక్క రెండో భాగం “PS 2” ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి మంచి టాక్ తో దూసుకుపోతుంది. భారీ తారాగణం తో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కించగా, విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ హీరో హీరోయిన్లు గా నటించారు. ఇక ప్రకాష్ రాజ్, రెహమాన్, ప్రభు, శరత్ కుమార్, జయరాం, ఐశ్వర్య లక్ష్మి, పార్తీబన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఏ.ఆర్ రహ్మాన్ సంగీతం అందించాడు.

పొన్నియన్ సెల్వన్ 2 విడుదలైన రోజు మిశ్రమ స్పందన దక్కించుకున్నా కలెక్షన్ల పై ఏమాత్రం ప్రభావం చూపించలేదు. విడుదలైన మొదటి రోజు PS1 కంటే PS 2 తక్కువ కలెక్షన్స్ వసూలు చేసినా, ఆ తర్వాత రోజు నుంచి పొన్నియన్ సెల్వన్ 2 మంచి వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమా మూడు రోజుల్లోనే 159 కోట్లకి పైగా వసూలు చేసింది.

తాజాగా పొన్నియిన్ సెల్వన్ 2 నాలుగవ రోజుతో 200 కోట్ల మార్క్ ని కూడా దాటేసింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 10.50 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా 4 రోజుల్లో 5. 23 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా సగం రాబట్టాలి. వరల్డ్ వైడ్ గా PS 2 నాలుగు రోజుల్లో 100 కోట్ల షేర్ ని వసూలు చేయాగా 207 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 72 కోట్లు రాబట్టాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు