పవన్ కళ్యాణ్ హీరోగా సాహో సుజిత్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం OG. RRR సినిమా తర్వాత దానయ్య డివివి ప్రొడక్షన్ లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నాని గ్యాంగ్ లీడర్ ఫెమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం OG సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ , OG సినిమా కోసం గత నెల ముంబై కి వెళ్లారు. ముంబైలో OG సినిమా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి రిటర్న్ అయ్యారు. ముంబై పవన్ ఏడు రోజులపాటు నిర్విరామంగా OG సినిమా షూటింగ్ లో పాల్గొని ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నారు.
Read More: Swetha Basu Prasad : ఏ పాత్రనైనా చేస్తా
సోషల్ మీడియా లో అప్పుడు యాక్టీవ్ గా ఉండే డివివి ఎంటర్టైన్మెంట్స్ OG షెడ్యూల్ కంప్లిట్ చేసిన విషయాన్ని ట్విట్టర్ ,ఇంస్టాగ్రామ్ లలో పోస్ట్ ద్వారా తెలియజేసారు. అయితే సుజీత్ మొదటగా పవన్ కళ్యాణ్ పార్ట్ షూట్ కంప్లిట్ చేసి, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి రిటర్న్ అయ్యాక మిగితా పార్ట్ షూటింగ్ ని చేసారంట.
ముంబై గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా సినిమా తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలలో చూసి విసిగిపోయిన పవన్ ఫ్యాన్స్ OG సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. బాలు ,పంజా సినిమాలలో గ్యాంగ్ స్టర్ గా కనిపించిన పవన్ మళ్ళీ OG సినిమాతో ఇలాంటి రోల్ లో కనిపించబోతున్నారు. మొదటి షెడ్యూల్ ముంబై లో కంప్లిట్ చేసిన ఈ మూవీ యూనిట్ సెకండ్ షెడ్యూల్ మహాబలేశ్వరంలో స్టార్ట్ చేయబోతున్నరంట. ఈ షెడ్యూల్ లో పవన్, ప్రియాంక మోహన్ పై కీలకమైన సీన్స్ షూట్ చేయబోతున్నారని సమాచారం.
Read More: Guntur Kaaram: మహా ఘాటుగా ‘గుంటూరు కారం’..!
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...