Ram charan: మెగా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్… రామ్ చరణ్ ఫేస్‌కి తీవ్ర గాయం?

Ram charan

మెగా పవర్ స్టార్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి తాజాగా వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులు గడుస్తుంది. అయినా ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. దీనికి కారణం, ఈ మూవీ డైరెక్టర్ శంకర్.. గేమ్ ఛేంజర్ తో పాటు కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఒకే సారి రెండు సినిమాల షూటింగ్స్ జరుగడం వల్ల గేమ్ ఛేంజర్ అనుకున్నదాని కంటే ఆలస్యమవుతుంది.

అయితే గేమ్ ఛేంజర్ మూవీ కొత్త షెడ్యూల్ ఆదివారం నుంచి స్టార్ట్ కావాల్సింది. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశారు చిత్ర యూనిట్. సినిమా సర్కిల్స్ లో కూడా గేమ్ ఛేంజర్ మూవీ కొత్త షెడ్యూల్ ఆదివారం నుంచి ఉంటుందని అందరికీ తెలుసు. కానీ, సడన్ గా ఆదివారం స్టార్ట్ కావాల్సిన గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ వాయిదా పడింది. దీంతో మెగా ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అంతే కాదు, డైరెక్టర్ శంకర్ పై మండిపడ్డారు కూడా. శంకర్ మళ్లీ ఇండియన్ 2 సెట్స్ కి వెళ్లాడని అందుకే కొత్త షెడ్యూల్ వాయిదా పడింది అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ శంకర్ పై ఫైర్ అయ్యారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ మూవీ కొత్త షెడ్యూల్ వాయిదా పడటానికి కారణం శంకర్ కాదట. హీరో రామ్ చరణ్ కి మొఖానికి ఇటీవల గాయమైందట. గాయం చిన్నదే అయినా డాక్టర్స్ 10 రోజుల పాటు రెస్ట్ ఇవ్వాలని సలహా ఇచ్చారట. దీంతో గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ ని చిత్ర యూనిట్ వాయిదా వేయాల్సి వచ్చిందని తెలుస్తుంది.

- Advertisement -

అయితే రామ్ చరణ్ ఫేస్ కి తగిలిన గాయం గురించి కూడా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఒక ఘటన వల్ల చరణ్ ఫేస్ కి చిన్న గాయం అయిందట. ఇఫ్పటికే డాక్టర్స్ ను సంప్రదించిన చరణ్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు