Ram Charan: గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ – శంకర్ ప్లానింగ్ అదుర్స్..!

Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతున్న ఫస్ట్ లుక్ మినహా ఎలాంటి అప్డేట్ లేకపోవటంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాతో పాటు ఇండియన్2 కూడా సైమల్టేనియస్ గా చేస్తుండటంతో గేమ్ చేంజర్ డిలే అవుతూ వస్తోంది.

మొదట 2024 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని భావించినప్పటికీ ఆ డేట్ కి ఇండియన్2 ని రిలీజ్ చేయాలని శంకర్ ఫిక్స్ అవ్వటంతో గేమ్ చేంజర్ ప్లాన్ మళ్లీ మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమాను ఇండియన్2 కంటే ముందే రిలీజ్ చేయాలని శంకర్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది.

2024 సంక్రాంతికి ఇండియన్2 సినిమా రిలీజ్ అవ్వటం కష్టం అని సమ్మర్ లో రిలీజ్ చేస్తారని వార్తలొచ్చిన నేపథ్యంలో గేమ్ చేంజర్ రిలీజ్ ఇంకా డిలే అయ్యే అవకాశం ఉందని భావించారు. అయితే, ఇండియన్2 సినిమాలో ఉన్న మెసేజ్ కి ఆ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయటం కరెక్ట్ అని శంకర్ భావిస్తున్నాడని సమాచారం. ఇండియన్2 ఆగస్టుకి షిఫ్ట్ అవ్వటంతో గేమ్ చేంజర్ ని మార్చ్ థర్డ్ వీక్ లేదా ఫోర్త్ వీక్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేషున్నాడట శంకర్.

- Advertisement -

కొంత గ్యాప్ తర్వాత ఇటీవలే స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఫిక్స్ అయిన డేట్స్ ప్రకారం షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నాడట శంకర్. దిల్ రాజుకి గేమ్ చేంజర్ 50వ సినిమా కావటంతో గేమ్ చేంజర్ బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తోంది. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి, భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అబుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు