Ram Charan: గేమ్ చేంజర్ ఇప్పట్లో రిలీజ్ అవ్వదా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం కిందట ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ డిలే అవుతూ వస్తోంది. దర్శకుడు శంకర్ ఇండియన్2 సినిమా మీద ఎక్కువ దృష్టి పెట్టడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మొదట్లో ఇండియన్2 2024 సంక్రాంతికి రిలీజ్ చేసి, గేమ్ చేంజర్ ని సమ్మర్ కి రిలీజ్ చేసే ప్లాన్ చేసారు మేకర్స్. అయితే, షూటింగ్ డిలే వల్ల ఇండియన్2 సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. దీంతో రామ్ చరణ్ కి సమ్మర్ కూడా మిస్ అయినట్టే అయ్యింది. ఉపాసన డెలివరీ కోసం గేమ్ చేంజర్ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన చరణ్ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉన్నప్పటికీ శంకర్ అందుబాటులో లేని పరిస్థితి కారణంగా గేమ్ చేంజర్ షూటింగ్ మొదలు కాలేదని తెలుస్తోంది.

2024 సమ్మర్ కుదరకపోతే, ఇక మిగిలింది దసరా,దీపావళి సీజన్స్ మాత్రమే. ఇప్పటికే రిలీజ్ డిలే అవుతుండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చరణ్ ఫ్యాన్స్ కి ఈ వార్తలు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. మరో పక్క రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను కంప్లీట్ చేసి బుచ్చిబాబు సినిమా స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.  ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తయ్యిందని సమాచారం.

షూటింగ్ మొదలైన కొంత కాలానికే బ్రేక్ పడింది ఇండియన్2 సినిమాకి, మళ్లీ విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటంతో సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను ఎలా అయినా పూర్తి చేయాలని శంకర్ మీద ఒత్తిడి తేవటం వల్లనే శంకర్ ఈ సినిమా మీద దృష్టి పెట్టాల్సి వచ్చిందని టాక్ వినిపిస్తోంది. మరి, మెగా ఫాన్స్ సహా నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తయ్యి ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు