Rangabali :క్యాస్ట్ ఫీలింగ్ తో సినిమా చేస్తున్నావా-పాదయాత్ర ఎందుకు చేసావ్-నాగ శౌర్య సమాధానాలు వైరల్

నాగ శౌర్య హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా రంగబలి. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాణ సారధ్యంలో వస్తోన్న ఈ సినిమాకి పవన్ భాసంశెట్టి దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా అనే కొత్త అమ్మాయిని పరిచయం చేస్తూ వస్తోన్న ఈ సినిమా జులై7న విడుదలకు సిద్ధంగా ఉంది.

అయితే ఇటీవలనే ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజ్ అవ్వగా, ప్రేక్షకుల నుంచి ఈ ట్రైలర్ కు మిశ్రమ స్పందన లభిస్తోంది. గతకొద్ది కాలంగా సరైన హిట్ లేక ఢీలా పడిపోయిన నాగ శౌర్య ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాలని గట్టిగ ఫిక్స్ అయినట్టు తెల్సుతోంది.

ఇక ఈ సినిమా సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలనే నాగ శౌర్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా యాంకర్ పలు ప్రశ్నలు అడిగాడు, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నాగ శౌర్యకు చెమటలు పట్టాయి. ఒక్కో ప్రశ్న ఒక్కో తూటాలుగా ఆయనపైకి వస్తుంటే ఈ యంగ్ హీరోకు ఎం చేయాలో పాలుపోలేదు.

- Advertisement -

వివరాల్లోకి వెళ్తే రంగబలి సినిమాలో నాగ శౌర్యకు ఫ్రెండ్ గా నటించిన కామెడియన్ సత్య, నాగ శౌర్యను ఇంటర్వ్యూ చేసాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయన నాగ శౌర్య కు పలు ప్రశ్నలు సంధించాడు. ఆ ప్రశ్నలు ఇలా ఉన్నాయి. “సినిమాలు బాగానే చేస్తున్నవ్ గా మళ్ళీ పాదయాత్ర అంటూ ఎందుకు షో చేసావ్, “ఈ సినిమాలో హీరోయిన్ తో రొమాన్స్ బాగా చేశావంట”, “నువ్వే డబ్బులిచ్చి సోషల్ మీడియాలలో నిన్ను నువ్వు ప్రమోట్ చేయించుకుంటున్నావంట” అని పలు ప్రశ్నలు సత్య అడగగా నాగ శౌర్య వీటికి సమాదానాలు ఇచ్చాడు.

అయితే ఇదంతా ఒక్క క్షణం నిజమే అనుకోని ఒక్కసారిగా సోషల్ మీడియా యువత అలెర్ట్ అయ్యి పోస్ట్ లు వేయడం స్టార్ట్ చేసారు. ఆ తరువాత ఇది రంగబలి సినిమా ప్రొమోషన్ స్టంట్ అని తెలియగానే అంత ఊపిరి పీల్చుకున్నారు. గత కొద్దీ కాలంగా సినిమా ప్రమోషన్స్ లో యాంకర్స్ హీరోలను అడిగే ప్రశ్నలను సత్య ట్రోల్ చేస్తూ ఈ వీడియో చేయగా ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు