Samantha: ఆ ఒక్క పొరపాటు వల్లే సమంత – నాగచైతన్య జీవితాలు సర్వ నాశనం అయిపోయాయట..!

Samantha

అక్కినేని నాగచైతన్య – సమంత పదేళ్లపాటు ప్రేమించుకున్న తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. కానీ వారి పెళ్లి మూడు నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకుంటున్నామని అధికారికంగా ప్రకటించి అభిమానులకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చారు. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అన్నది అంతుచిక్కని ప్రశ్న. అయితే సమంతని నాగచైతన్య పెళ్లి చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. అవును ఇప్పుడు అభిమానులు ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. నిజానికి నాగచైతన్య –  సమంత మధ్య ప్రేమ చిగురించడానికి బీజం పడింది ఏ మాయ చేసావే సినిమా షూటింగ్ లోనే. వీరిద్దరూ కలిసి నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. నిజానికి ఈ సినిమాలో నాగచైతన్య ప్లేసులో మొదటగా అనుకున్నది మహేష్ బాబుని. గౌతమ్ మీనన్ ఈ పాత్రకు మొదట మహేష్ బాబుని ఎంచుకున్నారట.

కానీ ఈ రోల్ ని మహేష్ బాబు రిజెక్ట్ చేయడం, ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి నాగచైతన్య రావడం, వీరిద్దరి మధ్య ప్రేమ మొదలు కావడం, ఆ తరువాత పెళ్ళి, విడాకులు అన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే ఇప్పుడు నాగచైతన్య – సమంత పెళ్లి చేసుకోవడానికి, విడిపోవడానికి కారణం మహేష్ బాబే అన్న కామెంట్స్  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ కామెంట్స్ ని తిప్పి కొడుతున్నారు మహేష్ అభిమానులు. వారు ఎవో కారణాలతో విడాకులు తీసుకుంటే మా హీరోని అంటారా..? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు