Mrunal Thakur: మృణాల్ కి అవకాశాల వెల్లువ

తెలుగులో సీతారామం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాతో సీతగా మంచి పేరును సంపాదించుకుంది. అయితే సీతారామం సినిమా అవకాశం రావటమే వింతగా జరిగింది. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. ఈ భారీ ఫాంటసీ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్టు గురించి ప్రపంచమంతా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టు కే సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ ని నాగ్ అశ్విన్ ఎంచుకున్నారంట. అయితే హను రాఘవపూడి ఈ కథను నరేట్ చేసిన తర్వాత సీత పాత్రకు ఎవరైతే బాగుంటుందని చాలా రోజులు పాటు ఆలోచనలో పడ్డారు. అయితే ఈ సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ బాగుంటుందని నాగ్ అశ్విన్ హను రాఘవపూడి కి సూచించారు.

ఆ తర్వాత సీతారామం సినిమాకి మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ గా తీసుకున్నాడు హను రాఘవపూడి. దాదాపు కెరియర్ అయిపోయింది అనుకునే తరుణంలో సీతారామం సినిమా మృణాల్ ఠాకూర్ కి ఊపిరి పోసింది. వరుస అవకాశాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది. అలానే నాని సరసన హాయ్ నాన్న సినిమాలో నటిస్తుంది.
హాయ్ నాన్న సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

మొత్తానికి మృణాల్ ఠాకూర్ నటించిన సినిమాలు డిసెంబర్లో ఒకటి జనవరిలో ఒకటి రిలీజ్ కానున్నాయి. ఇకపోతే తమిళ్లో ఏఆర్ మురుగదాస్ శివ కార్తికేయన్ కాంబినేషన్లో వస్తున్న శివ కార్తికేయన్ 23వ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోహిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. హిందీలో జెర్సీ సినిమా తర్వాత సరైన హిట్ లేదు అనుకున్న తరుణంలో సీతారామం ఇచ్చిన హిట్టు వరుస అవకాశాలను తెచ్చి పెడుతూ తెలుగులో ఇప్పుడు బిజీ హీరోయిన్ గా మార్చింది.

- Advertisement -

ఏదేమైనా మంచి కథలను ఎన్నుకొని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే తెలుగులో కొన్నేళ్లపాటు హీరోయిన్ గా నిలబడే అవకాశాలు మృణాల్ ఠాకూర్ కి బాగా ఉన్నాయని చెప్పవచ్చు.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు