Mrunal Thakur Love Story: బాలీవుడ్ ర్యాపర్‌తో మృణాల్ సీక్రెట్ రిలేషన్‌షిప్?

సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నేచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న, రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలలో నటిస్తోంది. అంతేకాకుండా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన పిప్పా అనే హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.

తాజాగా ఈమె ముంబైలో శిల్పా శెట్టి నిర్వహించిన దివాళి బాష్ లో సందడి చేసింది. అయితే ఈ పార్టీకి హాజరైన మృణాల్ ఠాకూర్.. బాలీవుడ్ ర్యాపర్ బాద్షా తో కలిసి జంటగా కనిపించింది. అంతేకాకుండా అతని చేతిలో చేయి వేసి పట్టుకొని కనిపించడంతో సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మృణాల్ అతడితో డేటింగ్ లో ఉందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు పార్టీ తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లారని.. ఆమె బాద్షా తో డేటింగ్ లో ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే కొందరు మాత్రం ఈ జోడి అస్సలు సెట్ కాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య ఈమె ఓ తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఇలాగే సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వైరల్ గా మారడంతో సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేసి వాటన్నింటికీ చెక్ పెట్టింది. మరి ఈ రూమర్స్ పై మృణాల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు