Mrunal Thakur Love Story: అల్లు అరవింద్ సాక్షిగా… తెలుగు హీరోతో ప్రేమలో పడ్డ సీతమ్మ ?

సినిమా ఇండస్ట్రీలో నటీనటులు పెళ్లి చేసుకోవడం ఎప్పుడూ జరుగుతునే ఉంటుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి గురించి చర్చ జరుగుతుంది. రేపటి నుంచి ఇటలిలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుక స్టార్ట్ కానుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీకి చేరుకుంది. పవన్ కళ్యాణ్ కూడా తన భార్యతో ఇటీవలే ఇటలీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఏడేళ్ల పాటు చాటుగా ప్రేమించుకున్న ఈ జంట రేపటితో ఒక్కటి కానుంది. అయితే వరుణ్, లావణ్య ఏడేళ్ల పాటు ప్రేమించుకుంటే, ఒక్క సారి కూడా బయట పడలేదు. కానీ, సరిగ్గా రెండేళ్ల క్రితం “చావు కబురు చల్లగా” అనే మూవీ ఈవెంట్ లో అల్లు అరవింద్… లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి ఓ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో మొన్నటి వరకు వైరల్ అయింది. దీంతో వరుణ్, లావణ్యల లవ్ స్టోరీ అల్లు అరవింద్ కు ముందే తెలుసని, అందుకే లావణ్య పెళ్లిపై అ.. కామెంట్ చేశారని టాక్ వచ్చింది.

తాజాగా అల్లు అరవింద్ మరోసారి ఓ నటి పెళ్లి గురించి అలాంటి కామెంటే చేశారు. ఇటీవల ఓ అవార్డ్ ఫంక్షన్ లో మృణాల్ ఠాకూర్ పెళ్లి గురించి అల్లు అరవింద్ కామెంట్ చేశారు. కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయి గురించి చెప్పాను. ఆ అమ్మాయి హైదరాబాద్ హీరోని పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు నువ్వు కూడా హైదరాబాద్ కి వచ్చేయ్ అంటూ మృణాల్ తో అల్లు అరవింద్ అన్నారు. దీంతో తెలుగులో హీరోతో మృణాల్ సాగిస్తున్న లవ్ స్టోరీ అల్లు అరవింద్ కి తెలిసే ఉంటుందని, అందుకే ఈ వ్యాఖ్యలు చేశాడని అంటున్నారు. అయితే ఆ తెలుగు హీరో ఎవరో కాదు… మెగా హీరోల్లో ఎవరో ఒకరు అయి ఉంటారు అనే కామెంట్ కూడా వస్తుంది.

- Advertisement -

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు