Niharika: నిహారిక కోసం లావణ్య త్రిపాఠి షాకింగ్ నిర్ణయం?

మెగా హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఘనంగా ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఈ వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య వీరిద్దరి రిసెప్షన్ కూడా గ్రాండ్ గా చేసుకున్నారు.

ఇక పెళ్లి తర్వాత మొదటిసారి వరుణ్, లావణ్య జంటగా తమ మొదటి దీపావళి జరుపుకున్నారు. వీరిద్దరితో పాటు నాగబాబు, తన భార్య, అలానే నిహారిక కూడా కాకరవత్తులు కాలుస్తూ కనిపించారు. నిహారిక, వరుణ్ తేజ్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించగా….. నిహారిక ఎర్ర చీరలో హుషారుగా కనిపించింది. వరుణ్, లావణ్య ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు, అలానే వీరిద్దరే దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ క్రమంలో లావణ్య మెగా డాటర్ నిహారిక కోసం ఓ త్యాగం చేయడానికి సిద్ధపడిందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే….. ఓ స్టార్ డైరెక్టర్ లావణ్య త్రిపాఠి దగ్గరకు వచ్చి ఓ స్టోరీ చెప్పారట. కానీ దానికి లావణ్య ఈ క్యారెక్టర్ కు నిహారిక బాగా సూట్ అవుతుందని చెప్పిందట. అయితే ఆ డైరెక్టర్ మాత్రం నిహారిక వద్దని లావణ్య త్రిపాఠికే చెప్పేసాడట. మీరైతే ఈ రోల్ లో బాగుంటారు అని మేము అనుకుంటున్నాం….. మీరు ఈ సినిమా చేయండి అంటూ బలవంతం చేస్తున్నారట.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు