Mega Family: బాలయ్యను కావాలనే మళ్ళీ అవమానించారా?

ఈ దీపావళి సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒక్కచోట చేరి తమ ఫ్యాన్స్ అందరిని ఫుల్ ఖుషి చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన కారణంగా ఈ పార్టీని మెగా ఫ్యామిలీ హోస్ట్ చేసింది. అందులో భాగంగానే బడా హీరోలు అందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. ఈ పార్టీ కారణంగా టాలీవుడ్ సీనియర్ సెలబ్రిటీలు అందరూ ఒక్కచోట కలుసుకున్నారు.

పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, అక్కినేని నాగార్జున, అమల, విక్టరీ వెంకటేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఇక ఇంతమంది సెలబ్రిటీలను ఒక్కచోట చూసిన టాలీవుడ్ సినీ ప్రియుల కళ్ళు దీపావళికి పేల్చే కాకర పువ్వొత్తుల్లా వెలిగిపోయాయి.

కేవలం సీనియర్ హీరోలే కాదు ఈ పార్టీకి నవ దంపతులు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తో పాటు అక్కినేని అఖిల్, వైష్ణవ తేజ్, అల్లు శిరీష్, సాయి ధరంతేజ్ లు అలాగే మరో టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ మంచు మనోజ్ – మౌనిక రెడ్డి కూడా హాజరయ్యారు. కాగా సోషల్ మీడియాలో వీరందరూ పార్టీని ఎంజాయ్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. వాటన్నిటిలోకెల్లా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ కలిసి ఉన్న ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది.

- Advertisement -

నాలుగు దశాబ్దాల నుంచి సినిమా రంగంలో పోటీ పడుతూ స్టార్ హీరోయిన్లుగా ఇప్పటికీ వెలిగిపోతున్న ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపించడం పెద్ద విశేషమే అని చెప్పాలి. అయితే అందులో అందరికీ ఓ వెలితి స్పష్టంగా కనిపిస్తోంది. మరో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ ఫోటోలలో, పార్టీలో మిస్సయ్యారు. దీంతో ఈ పార్టీకి బాలయ్యను పిలవలేదా? లేక వాళ్ళు పిలిచిన బాలయ్య వెళ్లలేదా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మామూలుగానే చిరు ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్ కైనా బాలయ్యకు ఆహ్వానం అందదని చెప్పొచ్చు. దీంతో బాలయ్య అభిమానులు చిరు కావాలనే మరోసారి ఆయనను అవమానించాడంటూ ఫైర్ అవుతున్నారు. అయితే ఇంత మంది స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్లో ఉండడం సినీ ప్రియులకు పండగే అయితే బాలయ్య లేకపోవడం ఆ ఫోటో కే కాదు టాలీవుడ్ కు కూడా లోటు అని చెప్పొచ్చు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు