Animal: యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్స్ గా టాలీవుడ్ స్టార్స్.. వీళ్లే ఎందుకంటే..?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా తాజాగా నటిస్తున్న చిత్రం యానిమల్.. డిసెంబర్ ఒకటవ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుతున్నాయి. అంతేకాదు సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తండ్రీ కొడుకుల మధ్య శృతి మించిన ప్రేమను అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుందని.. తండ్రి కోసం కొడుకు ఏం చేశాడనే కథతో ఈ సినిమా సాగుతుందని సమాచారం.

ఇకపోతే డిసెంబర్ ఒకటో తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే హిందీ తర్వాత తెలుగులో పెద్ద మార్కెట్ పెరిగిన నేపథ్యంలో అందరూ టాలీవుడ్ పై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో సందడి చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈరోజు మధ్యాహ్నం రణబీర్ కపూర్ , రష్మిక , సందీప్ రెడ్డి వంగా, నిర్మాత కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనబోతున్నారు. తర్వాత సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేయగా ఈ కార్యక్రమానికి ఇద్దరు స్టార్ గెస్ట్ లుగా వస్తున్నారట.

అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా ఈవెంట్ కి రాబోతుండడం విశేషం. అయితే వీరిద్దరే రావడానికి గల కారణం ఏమిటి అంటే.. రణబీర్ నటించిన బ్రహ్మస్త్ర చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసి దానికి సమర్పకులుగా రాజమౌళి వ్యవహరించారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆయన భాగమయ్యారు .అలా రణబీర్ తో అప్పటి నుంచే పరిచయం ఏర్పడింది .ఇక మరొకవైపు మహేష్ బాబు గెస్ట్ గా రావడానికి కారణం అర్జున్ రెడ్డి తర్వాత మహేష్ బాబుతో సందీప్ సినిమా చేయాలనుకున్నారు.చాలా రోజులపాటు దీనిపై ట్రావెల్ అయ్యారు .కానీ ఈ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదు.దీంతో ఈ మూవీని రణబీర్ తో చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ఇప్పుడు అలాగే కంటిన్యూ అవుతోంది

- Advertisement -

అందుకే వీరిద్దరిని చీఫ్ గెస్ట్లుగా పిలిచినట్లు సమాచారం మరొకవైపు మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇలాంటి సమయంలో వీరిద్దరూ ఈవెంట్ కి రావడం మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఈవెంట్ వేదిక పైన తమ ప్రాజెక్టుకు సంబంధించిన ఏదైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు