Sakshi Vaidya : పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయైతేనేం ? ఈ హీరోయిన్ పరిస్థితి కూడా అదే !

సాక్షి వైద్య… టాలీవుడ్ కు పెద్దగా పరిచయం లేని ఈ అమ్మడి పరిస్థితి ప్రస్తుతం పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయైతేనేం ? అన్నట్టుగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్ల కొరత గట్టిగా ఉంది. పాన్ ఇండియా మోజులో పడి ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లను పట్టించుకోవడానికి రెడీగా లేరు మన హీరోలు. ఇక ప్రస్తుతం శ్రీలీల, మృణాల్ ఠాకూర్ ఈ ఇద్దరు హీరోయిన్లదే హవా నడుస్తోంది. ఇలాంటి టైంలో బ్యూటీ, ట్యాలెంట్, గ్లామర్ ఉన్న కొత్త హీరోయిన్లకు ఎంట్రీ ఇవ్వడానికి ఇదే మంచి టైం. అయితే ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి సాక్షి వైద్య ప్రయత్నించింది. కానీ ఆమె అనుకున్నది ఒక్కటి, జరిగింది మరొకటి.

నిజానికి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కేవలం గ్లామర్ ఉంటే సరిపోదు. ఒకింత అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండూ ఉన్నవారే ఇక్కడ స్టార్స్ గా మెరిసిపోవడానికి అర్హులు. ఆ రెండిట్లో ఏది తక్కువైనా వాళ్లు కనుమరుగైపోవడం ఖాయం. ఇక సాక్షి వైద్య విషయానికి వస్తే తన ఫస్ట్ మూవీ అక్కినేని హీరో అఖిల్ తో చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఏజెంట్’ మూవీతో సాక్షి వైద్య తెరంగ్రేటం చేసింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అలా ఫస్ట్ మూవీ నే ప్లాప్ కావడంతో ఈ హీరోయిన్ ను ఎవరూ గుర్తించలేరు.

ఇక ఆ తర్వాత అయినా మంచి మూవీతో హిట్ కొడుతుందేమో అనుకుంటే ఆమెకి కాలం కలిసి రాలేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో “గాంధీవదారి అర్జున” అనే సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. అసలు ఆ మూవీ ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోయిందో కూడా టాలీవుడ్ ఆడియన్స్ కి తెలియదు. అలా రెండవ సినిమా కూడా డిజాస్టర్.

- Advertisement -

అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతున్న ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… మెగా కాంపౌండ్ లోని మరో హీరోతో నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మకు వచ్చిందట. కానీ టైం సరిపోక ఆ సినిమాను ఈ బ్యూటీ వదులుకోవాల్సి వచ్చిందట. అయితే రీసెంట్ గా వచ్చిన ఆ మూవీ కూడా డిజాస్టర్ కావడం గమనార్హం. నవంబర్ 24న పంజా వైష్ణవ తేజ్ హీరోగా ‘ఆదికేశవ’ అనే మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఫ్లాప్ అయింది. దీంతో శ్రీలీల ఖాతాలో ఈ డిజాస్టర్ పడింది. కానీ నిజానికి ఆ డిజాస్టర్ సాక్షి ఎకౌంట్లో పడాల్సి ఉంది.

ముందుగా సాక్షిని ‘ఆదికేశవ’ మూవీలో హీరోయిన్ గా అనుకున్నారట. ఏదైతేనేం రిజెక్ట్ చేసిన మూవీ తో పాటు, హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న సినిమా కూడా ప్లాఫ్ అయ్యింది. ఇంకేముంది పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయైతేనేం ? అనే సామెత గుర్తు చేసింది. ఏ సినిమా చేసినా సాక్షికి మాత్రం డిజాస్టర్ ముందే రాసిపెట్టినట్టుగా ఉంది. ఇక ఈ అమ్మడిని ఐరన్ లెగ్ అని ఇండస్ట్రీ పిలవడం ఒక్కటే మిగిలిపోయింది.
Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు