Overthinking: అతిగా ఆలోచిస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీ కోసమే

అతిగా ఆలోచిస్తున్నారా? ఓవర్ థింకింగ్ అనేది బుర్రను పాడు చేస్తుంది. అలాగే మనిషిని తెలియకుండా మెల్లమెల్లగా చంపేస్తుంది. మెంటల్ గా కూడా వీక్ అయిపోతారు. గతాన్ని వదిలేయండి. ప్రజెంట్ ఏం చేస్తున్నారో దానిపై దృష్టి పెట్టండి. ఫ్యూచర్ ని విధికి వదిలేయండి. అంతేగాని అలా చేయాలి? ఇలా చేయాలి, అలా జరిగి ఉంటే ఇలాగ ఉండేదాన్ని.. వంటి మాటలన్నీ పక్కన పెట్టండి. అయితే ఓవర్ థింకింగ్ అలవాటును మార్చుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కాకపోతే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

1. అతిగా ఆలోచించడం అనేది అలవాటుగా మారితే ప్రమాదకరం. కొన్నిసార్లు మీకు తెలియకుండానే అతిగా ఆలోచించే సమస్య స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏదైనా విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు అతిగా ఆలోచిస్తున్నారా ? అని ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఏదైనా ఒక విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం, లేదా మీ కంట్రోల్లో లేని విషయాల గురించి టెన్షన్ పడడం వంటివి చేస్తున్నారంటే అది కచ్చితంగా అతిగా ఆలోచిస్తున్నట్టే.

overthinking-but-these-tips-are-for-you

- Advertisement -

2. మీకు వచ్చిన సమస్యను పరిష్కరించే దారిని వెతకండి. మీరు సమస్యగా భావించే ఆ సమస్య మీ కంట్రోల్లో ఉంటే, దానికి పరిష్కారం ఏదైనా ఉందేమో ఆలోచించండి.

overthinking-but-these-tips-are-for-you

3. మీరు ఆలోచిస్తున్న విధానం కరెక్టా కాదా అనేది చూసుకోండి. నెగిటివ్ థింకింగ్ కి దూరంగా ఉండండి.

overthinking-but-these-tips-are-for-you

4. ఎక్కువ కాలం ఒకే సమస్యపై ఉక్కిరిబిక్కిరి కావడం కరెక్ట్ కాదు. ప్రతిరోజు ఓ 20 నిమిషాలను కేవలం ఆలోచించడానికి కేటాయించండి. ఆ సమయంలో మాత్రమే మీకు కావాల్సిన విషయం గురించి టెన్షన్ పడండి. సమస్య పరిష్కారం కోసం ఆలోచించండి. ఆ 20 నిమిషాలు గడిచిందంటే ఇతర విషయాలపై దృష్టి పెట్టండి.

overthinking-but-these-tips-are-for-you

5. మైండ్ ఫుల్ నెస్ స్కిల్స్ నేర్చుకోండి. ప్రజెంట్ లో జీవిస్తున్న మనం గడిచిన నిన్నటిని తీసుకురాలేం. అలాగే ఫ్యూచర్ గురించి టెన్షన్ పడడం టైం వేస్ట్. కాబట్టి మైండ్ ఫుల్ నెస్ స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి.

overthinking-but-these-tips-are-for-you

6. ఆలోచనను మార్చేయండి. మీ మైండ్ లోకి పదేపదే ఏదైనా ఒకే ఆలోచన వస్తూ ఉంటే, దాన్ని పక్కన పెట్టే విధంగా వేరే పని మీద దృష్టి సారించండి. డ్రాయింగ్ వేయండి, పెయింటింగ్ చేయండి, వంట చేయడం లేదా వ్యాయామం వంటివి మీ ఆలోచనను మార్చేస్తాయి

overthinking-but-these-tips-are-for-you

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు