Balakrishna: భగవంత్ కేసరికి ఆ టైటిల్ పెట్టింటే… సీన్ మరోలా ఉండేదేమో!

అనిల్ రావిపూడి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న భగవంత్ కేసరి చిత్రం ఈ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ వేగంగా చేస్తున్న చిత్ర యూనిట్, ప్రి రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ఈ నెల 16న శిల్ప కళా వేదికపై భగవంత్ కేసరి ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. మహేష్ బాబు, బాలయ్య గతంలో అన్‌స్టాపబుల్ షోలో కనిపంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ ద్వారా మళ్లీ ఒకే స్టేజ్ పై కనిపించబోతున్నారు.

ఈ విషయం పక్కన పెడితే, ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి ముందుగా అనుకున్న టైటిల్ భగవంత్ కేసరి కాదు. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తోనే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ టైటిల్ ను ముందుగా బ్రో ఐ డేంట్ కేర్ (Bro I Don’t Care) కానీ, చివరికి భగవంత్ కేసరి టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ కూడా పవర్ ఫుల్ గా ఉన్నా… Bro I Don’t Care అనే టైటిల్ ఉంటే సీన్ మరోలా ఉండేది అని అంటున్నారు బాలయ్య అభిమానులు.

Bro I Don’t Care అనే డైలాగ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. స్వయంగా బాలయ్య కూడా పొలిటికల్ మీటింగ్స్ లో ఈ డైలాగ్ ని వాడారు. ఇప్పుడు అదే డైలాగ్ తో సినిమా టైటిల్ ఉంటే, అటు బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉండేది. సినిమా టైటిల్ కు ఫ్రీ పబ్లిసిటీ కూడా వచ్చేది. దీంతో టైటిల్ విషయంలో అనిల్ రావిపూడి మరింత ఆలోచించాల్సి ఉండేది అంటూ బాలయ్య అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే బాలయ్య సూచనల మేరకు సినిమాకు Bro I Don’t Care కాకుండా భగవంత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు