Telugu Heroes: విగ్గు హీరోలు… ఇండస్ట్రీలో ఈ నెంబర్ ఎక్కువే!

నందమూరి బాలకృష్ణ ఇటీవల భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విగ్గు గురించి చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారాయో అందరం చూశాం. ఇప్పటి వరకు అందరికీ బాలయ్య విగ్గు పెట్టుకుంటారని తెలుసు. కానీ, స్వయంగా బాలయ్యే విగ్గు గురించి చెప్పడంతో బాలయ్యను ట్రోల్ చేసే వారి సంఖ్య పెరిగింది. ఇది చూసిన తర్వాత బాలయ్య ఫ్యాన్స్ ఊరుకుంటారా…? టాలీవుడ్‌లో విగ్గు పెట్టుకునే హీరోల అందరి పేర్లను బయటకి చెప్పేస్తున్నారు. వారిని ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ విగ్గు పెట్టుకుని సినిమాలు చేస్తున్న కొంత మంది గురించి ఇప్పుడు చూద్దాం.

సినిమాల్లో హీరోలు విగ్గు వాడటంలో రెండు రకాలు ఉంటాయి. పీరియాడిక్ సినిమాల్లో హీరోలు గానీ, నటీనటులు గానీ, తమ పాత్రలకు తగినట్టు విగ్గులు వాడాల్సిందే. లేకపోతే ఆ.. పాత్రలు హైలైట్ కాలేవు. ఇది మొదటి రకం.

ఇక రెండో రకం విగ్గు వాడకం అంటే… హీరోల వెంట్రకలు ఉడిపోయి ఉంటే… రోజుకో విగ్గు పెట్టుకుని సినిమాలు చేయడం. వీరు సినిమాల్లో కాకుండా బయట కనిపించినా, విగ్గుతోనే కనిపిస్తారు. ఎలా అంటే… అందరి ముందు ఒప్పుకున్న బాలయ్య లా అన్నమాట. ఈ రెండో రకంలో బాలయ్య ఒక్కడే కాదు.. చాలా మంది హీరోలు ఉన్నారు.

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి… చిరంజీవి తల వెంట్రుకులు మొదట్లో ఎక్కువే ఉండేవి. కానీ, పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత, ఎక్కువ ప్రచారం చేయడం, ఎండలో ఎక్కువ తిరగడం లాంటివి చేయడంతో వెంట్రుకులు రాలడం స్టార్ట్ అయిందట. దీంతో చిరంజీవి తన 150 మూవీ నుంచి విగ్గు వాడటం స్టార్ట్ చేశాడట.

ప్రభాస్… పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ప్రభాస్ కూడా విగ్గు యూజరే అని చాలా రోజుల నుంచి ఓ గాసిప్ ఉంది. తలకు ఎప్పుడు ఓ గుడ్డ కట్టుకుని కనబడటంతో విగ్గు వార్తలకు బలం చేకూరింది. అయితే టాలీవుడ్ వర్గాల్లో వస్తున్న టాక్ ప్రకారం… ప్రభాస్ కూడా బాహుబలి సినిమా నుంచి విగ్గు వాడటం స్టార్ట్ చేశాడట.

సూపర్ స్టార్ మహేష్ బాబు… మిల్క్ బాయ్‌గా, ప్రిన్స్‌గా టాలీవుడ్‌లో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే మహేష్ బాబు కూడా విగ్గు వాడే హీరోనే అని సమాచారం. మహేష్ నటించిన చాలా సినిమాల్లో విగ్గు వాడాడని ఎప్పటి నుంచో వినిపిస్తున్న న్యూస్.అతిథి సినిమా సమయంలో మహేష్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడని వార్తలొచ్చాయి. ఆ సినిమాలో లాంగ్ హెయిర్ తో కనిపించిన మహేష్ ఆ తర్వాత సినిమాల్లో హెయిర్ స్టైల్స్ పెద్దగా చేంజ్ చేయలేదు.మహేష్ నుంచి ఇటీవల వచ్చిన సర్కారు వారి పాటలో కూడా మహేష్ విగ్గు వాడరని టాక్.

విక్టరీ వెంకటేష్… సీనియర్ హీరో వెంకటేష్ కెరీర్ స్టార్టింగ్ నుంచే విగ్గు వాడేవారట. వెంకీ మామకు బట్టతల ఉంటుందట. దాన్ని ఎక్కడా కూడా కనిపించకుండా విగ్గును ప్రతి రోజు మెయింటెన్ చేస్తారని సమాచారం. గతంలో ఆయన ఒక్కో విగ్గు కోసం 60 వేల నుంచి 70 వేల వరకు ఖర్చు చేశారట. కానీ, ఇప్పుడు హెయిర్ ప్లాంటెషన్ చేయించుకున్నారని తెలుస్తుంది.

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా విగ్గును ఆశ్రయించక తప్పలేదు. మొదటి నుండి తేజ్ కి హెయిర్ తక్కువే అని చెప్పాలి. అయితే, చిత్రలహరి సినిమా వరకూ ఎలాగో అలా మేనేజ్ చేస్తూ వచ్చాడు తేజ్. అయితే, తేజ్ హీరోగా రీసెంట్ గా వచ్చిన విరూపాక్ష సినిమా కోసం విగ్గు వాడక తప్పలేదు.

వీరితో పాటు హీరో రామ్ పోతినేని, గోపిచంద్, సుమంత్ కూడా విగ్గు యూజర్లే అని టాలీవుడ్ లో టాక్. కానీ, 64 ఏళ్లు వచ్చిన కింగ్ నాగార్జున మాత్రం విగ్గు వాడరట. తాజాగా ఆయన నుంచి వస్తున్న నా సామి రంగ సినిమాలో నాగ్ లుక్ మాస్ గా ఉంది. అందులో కూడా నాగ్ విగ్గు వాడలేదట.

అయితే, హీరోలు విగ్గు పెట్టుకోవడం, పెట్టుకోకపోవడం ఏది చేసినా, తెలుగు ఆడియన్స్‌ను ఎంటర్ టైన్ చేయడమే వాళ్ల లక్ష్యం. విగ్గు లేకుండా వాళ్లు బయటకు రాగలరు. కానీ, వాళ్లు చేసే పాత్రలకు సెట్ అవ్వదని, విగ్గు పెట్టుకుని కనిపిస్తారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు