Prabha’s Salaar: సలార్‌కి ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్… హీరోలు కూడా పనికి రారు

ప్రశాంత్ నీల్… సౌత్ ఇండస్ట్రీలోనే కాదు, భారతీయ సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ పేరు వినిపిస్తోంది. చేసింది మూడు సినిమాలే అయినా, ప్రశాంత్ నీల్ కు వచ్చిన గుర్తింపు అంతా ఇంత కాదు. కేజీఎఫ్1, కేజీఎఫ్ 2 ఎలాంటి విజయం సాధించాయో ఇంకా ఎవరు మర్చిపోలేదు. ప్రశాంత్ నీల్ నుంచి రాబోతున్న సలార్, NTR31 కూడా అంతకు మించి విజయం సాధిస్తాయని సినీ విమర్శకులు, ప్రేక్షకులు ఇప్పటి నుంచే అంచనా వేస్తున్నారు. అయితే ఇలాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తన సినిమాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో ఇప్పుడు చూద్ధాం.

ప్రశాంత్ నీల్ నుంచి రాబోతున్న తాజా చిత్రం సలార్. ఈ చిత్రం సెప్టెంబర్ 28నే విడుదల కావాల్సింది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న రిలీజ్ చేయబోతున్నారు. ఇదే రోజున రాజ్ కుమార్ హిరానీ, షారుక్ ఖాన్ కాంబినేషన్ లో వస్తున్న డంకీ కూడా రిలీజ్ కాబోతుంది. అయినా, అదే రోజు రిలీజ్ చేస్తున్నారంటే, ఆ సినిమాపై వాళ్లకు ఉన్న నమ్మకమనే చెప్పొచ్చు.

అయితే సలార్ కోసం ప్రొడ్యూసర్లు హోంబలే ఫిల్మ్స్ నుంచి ప్రశాంత్ నీల్ ఏకంగ 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అంతే కాదు, సినిమా ఫైనల్ రన్ లో వచ్చే లాభాల్లో వాటా కూడా తీసుకుంటారట. అందుకు సంబంధించిన అగ్రిమెంట్స్ ఇప్పటికే పకడ్బందీగా రాసుకున్నారని టాక్. ప్రశాంత్ నీల్ గతంలో కేజీఎఫ్1, కేజీఎఫ్2 కి కూడా కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకున్నారు. ఇప్పుడు సలార్ విషయంలో కూడా అదే ఫాలో అవుతున్నారు.

- Advertisement -

అలాగే రాబోయే NTR31 కి కూడా అలాంటి అగ్రిమెంటే చేసుకున్నాడట ప్రశాంత్ నీల్. అంతే కాదు, NTR31 ను నిర్మించబోయే, మైత్రీ మూవీ మేకర్స్, డీవీవీ దానయ్య ఇప్పటికే ప్రశాంత్ నీల్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట. ఇలా ప్రతి సినిమాకు టైర్ 2 హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ప్రశాంత్ నీల్. పైగా లాభాల్లో వచ్చే వాటా స్పెషల్.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు