Polimera 2: హీరోగా చాలా బిజీ..!

సినిమా ఇండస్ట్రీలో జీవితం ఎప్పుడెలా మారుతుందో చెప్పడం చాలా కష్టం.. రాత్రికి రాత్రే అందనంత ఎత్తుకు ఎదగటం.. ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడం ఇవన్నీ ఎక్కువగా జరిగేవి సినీ పరిశ్రమలోనే.. అయితే అసందర్భంగా ఈ వేదాంతం చెప్పడమేంటని అనుకుంటున్నారా..నిజానికి ఇలాంటి విషయాలు చెప్పడానికి మంచి సందర్భం కూడా కావాలి.. ఇక ఆ సందర్భమే ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ సత్యం రాజేష్ వల్ల వచ్చిందని చెప్పవచ్చు.

టాలీవుడ్ సినీ పరిశ్రమలో కమెడియన్ గా చాలా ఏళ్ళ నుంచి కొనసాగుతున్న సత్యం రాజేష్ ఇటీవలనే హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. 2021 లో మా ఊరి పొలిమేర అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయమైన సత్యం రాజేష్, ప్రస్తుతం హీరోగా తెలుగుతో పాటు పలు భాషల్లో మంచి ఆఫర్స్ అందుకుంటున్నాడట.

ఇప్పటికే మలయాళంలో ఒక సినిమా కూడా ఒకే చేసి.. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడట.. సత్యం రాజేష్. ఇక హీరో అయిపోయానని క్యారెక్టర్ లు వస్తే నో చెప్పకుండా, పెద్ద సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే , చిన్న సినిమాలలో హీరోగా కూడా చేస్తున్నాడు సత్యం రాజేష్.

- Advertisement -

పొలిమేర సినిమా తరువాత కళాపురం సినిమాలో హీరోగా నటించిన సత్యం రాజేష్ లేటెస్ట్ పొలిమేర సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పొలిమేర 2 లో నటిస్తున్నాడు. నవంబర్ 3 న రిలీజ్ సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. ఇక ట్రైలర్ ప్రెస్ మీట్ లో భాగంగా విలేకరులతో మాట్లాడిన సత్యం తన కెరీర్ ఇప్పుడు బాగుందని, హీరోగా తమిళ్, తెలుగు, మలయాళంలో మంచి సినిమాలు వస్తున్నట్టు చెప్పాడు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా హీరోగా కూడా బిజీగా ఉంటున్న అంటూ చెప్పుకొచ్చాడు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు