Salaar VS Dunki: సలార్ సునామీ… వెనక్కి తగ్గుతున్న బాద్ షా?

డిసెంబర్ 22.. సినీ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న డేట్ ఇది. ఎందుకంటే, ఈ డిసెంబర్ 22న రెండు సినిమాలతోనే వరల్డ్ క్లాస్ డైరెక్టర్ గా ఎదిగిన ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న సలార్ మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే బాలీవుడ్ లో ఓటమి ఎరుగని డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ, వరుసగా రెండు సార్లు 1000 కోట్లు కలెక్ట్ చేసిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా వస్తున్న డంకీ మూవీ కూడా ఇదే రోజు రిలీజ్ కాబోతుంది.

ఇద్దరు స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుంటే చూడాలని సినీ లవర్స్ అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. నిజానికి సలార్ సెప్టెంబర్ 28నే విడుదల కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 22కి వాయిదా వేసుకుంది. సలార్ వాయిదా అనౌన్స్ మెంట్ రాక ముందు వరకు డంకీ టీం చాలా పకడ్బందీగా రిలీజ్ డేట్ గురించి ప్లాన్ చేసుకుంది.

కానీ, సలార్ నుంచి అనౌన్స్ మెంట్ రాగానే డంకీ టీం ఆలోచనలో పడింది. ఎందుకంటే, షారుక్ ఖాన్ ఈ సినిమాతో కూడా 1000 కోట్లు కలెక్ట్ చేసి ఒకే ఏడాది వరుసగా మూడు సినిమాలతో 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ హీరోగా రికార్డు నమోదు చేయాలని చూస్తున్నాడు. అలాగే రాజ్ కుమార్ హిరానీ, ఎప్పటిలాగే తన మూవీ ఫ్లాప్.. నెగిటివ్ టాక్ రావొద్దు అని చూస్తున్నాడు. ఈ రెండు జరగాలంటే, ఒంటరిగానే బరిలోకి దిగాలి. అలా కాదని, ఇలాంటి భారీ సినిమాతో పోటీ పడితే, ఎదైనా జరగొచ్చు. అందుకే రాజ్ కుమార్ హిరానీ, షారుక్ ఖాన్ డంకీ రిలీజ్ డేట్ విషయంలో మరోసారి ఆలోచిస్తున్నారని టాక్.

- Advertisement -

అయితే సలార్ విషయంలో ప్రశాంత్ నీల్, ప్రభాస్ చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలను చూసి ఆడియన్స్ కూడా సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అనే క్లారిటీతోనే ఉన్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ లేవు. కానీ, భారీ హైప్ ఉంది. ఈ నేపథ్యంలో డంకీ వాయిదా పడే అవకాశం ఎక్కువ ఉందని తెలుస్తోంది. రాజ్ కుమార్ హిరానీ డంకీని 2024లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. వచ్చే ఏడాది సమ్మర్ ముందు డంకీని బాక్సాఫీస్ ముందు నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి షారుక్ ఖాన్ కూడా ఓకే అన్నారట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు