Shah Rukh Khan Dunki Movie: జవాన్ బ్లాక్ బస్టర్ హిట్… కానీ ఇప్పుడే అసలైన పరీక్ష

Shah Rukh Khan Dunki Movie

షారుక్ ఖాన్.. ప్రస్తుతం బాలీవుడ్‌ ఆడియన్స్‌కి ఒక దేవుడిలా కనిపిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ ఒక్క హిట్ లేకుండా దిక్కుతొచిన స్థితిలో ఉన్నప్పుడు పఠాన్ మూవీతో 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాలీవుడ్ ఆకలిని తీర్చిన హీరో షారుక్ ఖాన్. పఠాన్ తర్వాత ఇప్పుడు జవాన్‌తో మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతున్నాడు. రెండు రోజుల్లోనే 260 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి మరోసారి 1000 కోట్ల మార్క్‌ను అందుకోవడానికి అడుగులు వేస్తున్నాడు.

ఇలా ఒకే సంవత్సరం రెండుసార్లు 1000 కోట్ల కలెక్షన్లు అందుకున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ, ఈ ఏడాది షారుక్ నుంచి మరో మూవీ రాబోతుంది. అదే డంకీ. ఈ ఏడాది డిసెంబర్ 22న డంకీ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. షారుక్ ఫామ్ చూస్తే మరోసారి 1000 కోట్ల మార్క్ అందుకోవడం దాదాపు ఖాయమనే చెప్పుకొవచ్చు.

అంతే కాదు, అక్కడ ఉంది రాజ్ కుమార్ హిరాని. ఈ బీ టౌన్ సెన్సేషనల్ డైరెక్టర్ గత మూడు సినిమాలు గమనిస్తే..

- Advertisement -

సంజు – బడ్జెట్: 100 కోట్లు… కలెక్షన్లు: 600 కోట్లు
PK – బడ్జెట్: 120 కోట్లు… కలెక్షన్లు: 800 కోట్లు
త్రీ ఇడియెట్స్ – బడ్జెట్ 50 కోట్లు… కలెక్షన్లు 500 కోట్లు (దాదాపు)

ఈ లెక్కలను చూస్తే… తక్కువ బడ్జెట్‌తో భారీ స్థాయి కలెక్షన్లు చేసి చూపించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని తెలిసిపోతుంది. ఇప్పుడు డంకీ సినిమాను కూడా 100 నుంచి 150 కోట్ల లోపు బడ్జెట్‌తోనే తెరకెక్కిస్తున్నాడట. అలాగే కలెక్షన్లు కూడా ఎక్కువనే ఉండబోతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు హై యాక్షన్ సీన్స్‌లో కనిపించిన షారుక్ ఖాన్, డంకీ సినిమాలో ఎమోషనల్, లవ్ & రొమాన్స్‌తో పాటు రాజ్ కుమార్ హిరాని సినిమాల్లో కనిపించే కామెడీ కూడా ఎక్కువే ఉంటుందట. ఎమోషనల్, కామెడీ సిన్స్‌‌లో బాలీవుడ్ బాద్ షా ఎలా యాక్ట్ చేస్తాడో అందరికీ తెలిసిందే. అయితే దానికి రాజ్ కుమార్ హిరాని డైరెక్టర్ గా ఉండటం అనేది మరింత ప్లస్.

అయితే ఇక్కడ చిన్న పరీక్ష కూడా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్న షారుక్ నుంచి మళ్లీ అదే రేంజ్ సినిమాలను ఆడియన్స్ అంచనా వేస్తారు. ఇప్పుడు అ అంచనాలను అందుకోలేకపోతే మాత్రం సినిమాను దారుణమైన రిజల్ట్ రావడం మాత్రం పక్కా.

అంటే ఇప్పుడు రాజ్ కుమార్ హిరాని.. డంకీని తాను అనుకునే ఎమోషనల్, కామెడీ అండ్ రోమాన్స్ సీన్స్‌తో నింపడమే కాకుండా, షారుక్ ఫ్యాన్స్ కోసం కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ను కూడా బలవంతంగా అయినా చొప్పించాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు