Srinu Vaitla: అదృష్టం కొద్దీ అవకాశం వచ్చింది.. ఇప్పుడైనా వాడుకుంటాడా?

Srinu Vaitla

టాలీవుడ్ లో ఒకప్పుడు వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతూ, టాప్ డైరెక్టర్లలో ఒకడిగా వెలిగిన డైరెక్టర్ శ్రీనువైట్ల. ఈ డైరెక్టర్ చేసిన సినిమాలన్నీ దాదాపు కామెడీ ఆక్షన్ డ్రామాలే. అప్పట్లో శ్రీనువైట్ల సినిమాలంటే ఎంటెర్టైన్ మెంట్ గ్యారెంటీ అని భావించి ఆడియన్స్ థియేటర్లకు వచ్చేవారు. అయితే మారుతున్న కాలం కొద్దీ ఆయన క్రియేట్ చేసే కామెడీల్లో క్రియేటివిటీ తగ్గుతూ వస్తుంది. దానికి తోడు జబర్దస్త్ వంటి షోలు వచ్చిన తరువాత జనాలు కొత్త కామెడీ కావాలని కోరుకుంటున్నారు.

అందుకే శ్రీనువైట్లకు వరుస ప్లాపులు వెంటాడాయి. ఇదీ గాక శ్రీను వైట్ల కొత్త రకమైన సినిమాలు చేయకుండా, కామెడీ జోనర్ కే పరిమితమవడం వల్ల కూడా తనకు ఆఫర్లు తగ్గిపోయాయని చెప్పవచ్చు. దాదాపు పదేళ్ల కిందట వచ్చిన బాద్ షా హిట్ తర్వాత మళ్ళీ హిట్ మొహం చూడలేదు శ్రీను. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోని అన్ని దారుణంగా ప్లాప్ అయ్యాయి.

అయితే ఇంత కాలానికి శ్రీను వైట్ల కి మళ్ళీ అదృష్టం తలుపుతట్టింది.మ్యాచో స్టార్ గోపీచంద్ ఆయనతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. కొత్త నిర్మాణ సంస్థ చిత్రాలయం ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న ఆ సినిమా తాజాగా ఓపెనింగ్ జరుపుకుంది. రాఘవేంద్ర రావు ముఖ్య అతిధిగా ప్రొడక్షన్ నెంబర్1 పేరిట స్టార్ట్ అవగా, నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

- Advertisement -

గోపిమోహన్ ఈ సినిమాకు కథ అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఏ జోనర్ లో చేస్తున్నారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. నెటిజన్లు మాత్రం శ్రీను వైట్ల తన స్టైల్ లో కాకుండా గోపీచంద్ స్టైల్ లో కమర్షియల్ మాస్ సినిమా తీయాలని కోరుకుంటున్నారు. మరి లేక లేక అందివచ్చిన ఈ అవకాశాన్ని శ్రీను వైట్ల సక్సెస్ ఫుల్ గా ఉపయోగించుకుంటాడా లేదా అన్నది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు